AP CM Chandrababu Naidu: పేదవాడిని పైకి తెద్దాం
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:44 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మార్గదర్శి-బంగారు కుటుంబం.. పీ4-జీవో పావర్టీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రణాళిక ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంపద కొందరికే పరిమితం కారాదు: చంద్రబాబు
అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ.. ఎక్కడకు వెళ్లినా భారతీయులే ఎక్కువ. ఆయా దేశాల్లో ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు ఉండే ఏకైక జాతి మనదే. వారిలో కనీసం 30ు మంది తెలుగువారు ఉండాలనేది నా ఆకాంక్ష.. స్వార్థం కూడా. అందుకోసమే పనిచేస్తున్నాను.
ఫ గతంలో ప్రపంచం మొత్తం యూదుల గురించి మాట్లాడేవారు. రేపు ఆంధ్రప్రదేశ్, తెలుగు జాతి గురించి మాట్లాడుకోవాలి. ఏ సమస్య అయినా పరిష్కరించే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నిరూపించుకోవాలి.
- సీఎం చంద్రబాబు
పేదరికం తగ్గడానికి పీ4 మార్గం: పథకం ప్రారంభంలో సీఎం
జీవితాంతం సమాజం కోసమే!
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో కళ తప్పింది.. ఇలా కూర్చుని
మాట్లాడుకునే పరిస్థితి లేదు.. ఉగాది వేడుకల్లో చంద్రబాబు
సమాజం వల్లే బాగా సంపాదించారు
దానికి ఎంతో కొంత తిరిగివ్వాలి
మీతో పుట్టినవారు పేదవాళ్లుగానే ఉన్నారు
తిండి దొరకడం లేదు.. సొంత ఇళ్లూ లేవు
వారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలి
భవిష్యత్‌లో పేదవాళ్లు ఉండకూడదు
ఇదే నా జీవిత ఆశయం
తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యత మార్గదర్శులదే: సీఎం
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ‘‘మనతోపాటు పుట్టినవాడికి తిండిలేదు, మనం పెద్ద పెద్ద ప్యాలె్‌సల్లో ఉంటే.. వాడికేమో ఇల్లు లేదు. మీలో చాలా మంది సమాజం వల్ల పైకి వచ్చారు. కాబట్టి తిరిగి దానికి ఎంతో కొంత ఇవ్వాలి. పేదవాళ్లుగానే ఉన్న మీతోటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను సంపన్నులు తీసుకోవాలి. దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలనే ‘మార్గదర్శి-బంగారు కుటుంబం.. పీ4-జీవో పావర్టీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది జరిగితే తన జన్మ చరితార్థమవుతుందన్నారు. తెలుగు జాతిని తెలివైన జాతిగా మార్చే బాధ్యతను మార్గదర్శులకు ఆయన అప్పజెప్పారు. కెరీర్లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలామంది అవకాశాలు వినియోగించుకోలేకపోతున్నారని, వారందరికీ మాటసాయం, ఆర్థిక సాయం చేసి.. వారి కెరీర్‌ను డిజైన్ చేయాలని పిలుపిచ్చారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్-పార్ట్‌నర్‌షి్‌ప-పీ4 కార్యక్రమాన్ని ‘మార్గదర్శి-బంగారు కుటుంబం.. పీ4-జీవో పావర్టీ’ పేరిట ఆదివారం సాయంత్రం అమరావతిలో సీఎం ప్రారంభించారు. ఆ సందర్భంగాను, అంతకుముందు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ఉగాది సంబరాల్లోను ఆయన ప్రసంగించారు. పేదలను ఎలా ఆదుకోవాలి, వారికోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
సంపద కొంతమందికే పరిమితం కాకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సమసమాజమన్నారు. భవిష్యత్‌లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లు లేకుండా చేయాలని లక్ష్యంతోనే పీ-4 విధానం తీసుకొచ్చామని తెలిపారు.
‘మొదటి ఫేజ్ జీరో పావర్టీ.. ఆ తర్వాత మెరుగైన, ఉన్నత జీవన ప్రమాణాలు పెంపొందించడం. అవసరమైన అందరికీ విద్య, వైద్యం.. అన్నింటిలో సహకారం అందించాలనేదే నా జీవిత ఆశయం. చివరిగా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ. అందరికీ సమానావకాశాలు కల్పించి అందరినీ సమానంగా చూడాలి. ఇది ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఇలాంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలి’ అని కోరారు. విశ్వావసు నామ సంవత్సరంలో తెలుగువారు ప్రపంచస్థాయి గుర్తింపు పొందాలని.. వారు చరిత్ర రాయాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. మనుషులు తలచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. దృఢసంకల్పం ఉంటే ఎలాంటి జటిల సమస్యనైనా పరిష్కరించవచ్చని.. ఆ శక్తి తెలుగు జాతికి ఇంకా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాదినాడు చేపట్టే కార్యక్రమం జయప్రదమవుతుందని.. అందుకే పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించానని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఆ గౌరవం, తృప్తి రావు..
డబ్బులున్నవారికే ఎక్కువ కష్టాలుంటాయి. వాటిని ఎలా కాపాడుకోవాలనే టెన్షన్ ఉంటుంది. అందుకే బీపీలు వస్తున్నాయి. ప్రాణాలు పోయాక సంపాదించింది మీవెంట రాదు. మీ పిల్లలకు చెందుతుంది. ఆర్థికంగా ఒకస్థాయికి వచ్చిన వాళ్లు మంచి పేరు కోసం, ప్రజల మెప్పు కోసం పనిచేస్తారు. మీ తెలివితేటలు, ఆలోచనలు, సంపదతో కుటుంబాలను, సమాజాలను మార్చగలిగితే దానివల్ల వచ్చే గౌరవం, తృప్తి.. ఇక దేనివల్లా రావు. ఒక్కొక్కరికీ 20, 30 కంపెనీలున్నాయి. పీ4 కింద మీరు చేయాల్సిన పనులను కూడా ఒక కంపెనీగానే అనుకోండి. పేదల జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయాలో చేయండి. తెలుగు జాతిని తెలివైన జాతిగా తయారుచేసే బాధ్యత మార్గదర్శులకు అప్పజెబుతున్నా. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకు మౌలిక సదుపాయాలన్నీ ఇస్తాం. కానీ వాళ్ల కెరీర్‌ను బాగుచేసే బాధ్యత మార్గదర్శులదే. ఆగస్టు 15నాటికి ఒక రూపం తీసుకొస్తాం. వచ్చే ఉగాదినాటికి ఏం చేశామో చెబుతాం.
డబ్బులు ముఖ్యం కాదు..
బిల్ గేట్స్ 1991-92లో కంపెనీ పెట్టారు. ఇంటర్నెట్ విప్లవం తీసుకొచ్చారు. ప్రపంచాన్ని అనుసంధానించారు. అయితే డబ్బులు ముఖ్యం కాదు.. ప్రజాసేవ ముఖ్యమని.. రాజకీయం ద్వారా కాదు.. ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. వారెన్ బఫెట్.. సమయం లేదని తన డబ్బును కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు ఇచ్చారు. విప్రో అధినేత కొన్ని వేల కోట్లు చారిటీకి ఇస్తున్నారు.. టాటా ఫౌండేషన్ కూడా సాయం అందిస్తోంది. ప్రభుత్వం సైతం సీఎ్‌సఆర్ పెట్టింది. ఇలా అందరూ ఖర్చు పెడుతున్నారు.
ఐటీ ఉద్యోగాలు అప్పటి విజన్
25ఏళ్ల కంటే ముందు.. ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాను. అది అప్పటి రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో పనులు చేశాం. పోలవరానికి నిధులొచ్చాయి. 2027కే పూర్తవుతుంది. విశాఖలో రైల్వేజోన్ వచ్చింది. విశాఖ ఉక్కుకు కేంద్రం డబ్బులిస్తోంది. ప్రైవేటీకరణ ఆపి పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి ప్రభుత్వంలో ఉండడం సువర్ణావకాశం. కేంద్రంలో మోదీ రూపంలో సరైన సమయంలో సరైన ప్రధాని ఉండడం మన అదృష్టం. నాకు పనితప్ప వేరే అలవాటేమీ లేదు. ఏంచేస్తే పేదల జీవితాల్లో మార్పొస్తుందా అనే ఆలోచనతో నిద్రలేస్తాను. ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్‌లో కూడా చేయను. అందుకే రాత్రి ఆనందంగా నిద్రొస్తుంది.
అంబేడ్కర్‌కు మార్గదర్శి సాయాజీరావు
మనందరి స్ఫూర్తి దాత అంబేడ్కర్. కుటుంబంలో 12వ సంతానం.. తెలివి ఉంది. కానీ అనుకూలమైన వాతావరణం లేదు. అంటరానితనం, అవమానాలు ఎదుర్కొన్నా.. పట్టుదలను మాత్రం వదులుకోలేదు. ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన అవసరం పడింది. ఆయన మేధాశక్తి గురించి తెలిసి నాటి బరోడా రాజు సాయాజీరావు మహరాజ్ అండగా నిలిచారు. బాంబేలోని ఒక కళాశాలకు పంపి నెలకు25 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ పంపి నెలకు 11 డాలర్లు ఇచ్చారు. చదువు పూర్తయ్యాక ఏజీ కార్యాలయంలో ప్రొబేషన్‌గా పెట్టుకున్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజ్యాంగ రూపకర్తగా అంబేడ్కర్‌ను సాయాజీరావు తీర్చిదిద్దారు. పీ-4 మార్గదర్శులు కూడా అలాంటి సాయాలే చేయాలి.
కలాంకు అయ్యర్ బలం
దేశం గర్వించదగిన విశిష్టమైన వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవారు. అప్పట్లో ముస్లింలు, బ్రాహ్మణులు కలిసి భోజనం చేయకూడదు, కలిసి కూర్చోకూడదు. అలాంటి సమయంలో కలాంను శివసుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గరకు తీశారు. గణితం అధ్యాపకుడిగా సలహాలిచ్చి.. శిష్యుడిగా ఆదరించారు. దాంతో కలాంకు ధైర్యం వచ్చింది. శాస్త్రవేత్తగానే గాక రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. స్వామి వివేకానంద తన జ్ఞానబోధతో ప్రపంచాన్ని మెప్పించారు. ఆయన వెనుక రామకృష్ణ పరమహంస ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News