AP DSC notification: వారంలో మెగా డీఎస్సీ
ABN, Publish Date - Apr 05 , 2025 | 02:43 AM
ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే కొత్త రోస్టర్ ప్రకారం పోస్టుల కేటాయింపు జరుగనుంది.

నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతంచేసింది. ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలౌతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16వేలకు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 02:43 AM