Missing Child Drone Search: పాప తప్పిపోయింది... డ్రోన్ కనిపెట్టింది!
ABN, Publish Date - Mar 26 , 2025 | 04:47 AM
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మిస్ అయిన ఏడేళ్ల చిన్నారిని పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి సురక్షితంగా నాయనమ్మకు అప్పగించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో అరగంటలోపే నాయనమ్మ ఒడికి చేర్చిన పోలీసులు
భీమవరం క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నాయనమ్మతో వచ్చి తప్పిపోయిన చిన్నారి ఆచూకీ డ్రోన్ సాయంతో పోలీసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నగొల్లపాలెంకు చెందిన బొర్రా వెంకట నారాయణమ్మ తన మనుమడు, మనుమరాలితో ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం భీమవరం హెడ్ పోస్టాఫీ్‌సకు వెళ్లారు. మంచినీళ్ల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏడేళ్ల మనుమరాలు దివ్య కనిపించకపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ కిరణ్ కుమార్ తక్షణమే స్పందించి తమ సిబ్బందితో కలసి గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో డ్రోన్ ద్వారా సమీపంలోనే చిన్నారి ఉన్నట్టు గుర్తించి ఆమెను సురక్షితంగా నారాయణమ్మకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 26 , 2025 | 04:47 AM