Mogalthuru ZP High School: పవన్ చొరవకు లోకేశ్ తోడు
ABN, Publish Date - Mar 30 , 2025 | 04:39 AM
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు శ్రీపెన్మత్స రంగరాజా జడ్పీ హైస్కూల్‌కు అభివృద్ధి సంకేతాలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదనలతో, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రూ. 1.71 కోట్లు మంజూరు చేశారు. పాఠశాల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు.

మొగల్తూరు హైస్కూల్ అభివృద్ధికి రూ.1.71 కోట్లు మంజూరు
మొగల్తూరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు శ్రీపెన్మత్స రంగరాజా జడ్పీ హైస్కూలుకు మహర్దశ పట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు పంపించగా, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రూ.కోటీ 71 లక్షలు మంజూరు చేయించారు. ఈ క్రమంలో పవన్‌తో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శనివారం ప్రత్యేకంగా మొగల్తూరు అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభించి పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News
Updated Date - Mar 30 , 2025 | 04:39 AM