నేత్రపర్వం

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:44 AM

వీరమ్మ తల్లి ఊయల ఉత్సవం భక్తజనసందోహం నడుమ ఆదివారం నేత్రపర్వంగా సాగింది. పదిహేను రోజు పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు నగర వీధుల్లో వైభవంగా ఊరేగి ప్రధాన సెంటర్‌ సమీపంలోని ఊయల స్తంభాల వద్దకు చేరుకున్నారు. కన్నుల పండువగా ఊయల ఉత్సవం జరుపుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఉయ్యూరు జనసంద్రంగా మారింది.

నేత్రపర్వం

- వైభవంగా వీరమ్మ తల్లి ఊయల ఉత్సవం

- తిరుగండ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిన ఉయ్యూరు

- ప్రధాన రహదారిలోని ఆలయంలో కొలువుతీరిన అమ్మవారు

ఉయ్యూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) :

వీరమ్మ తల్లి ఊయల ఉత్సవం భక్తజనసందోహం నడుమ ఆదివారం నేత్రపర్వంగా సాగింది. పదిహేను రోజు పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మెట్టినింటి నుంచి బయలుదేరిన అమ్మవారు నగర వీధుల్లో వైభవంగా ఊరేగి ప్రధాన సెంటర్‌ సమీపంలోని ఊయల స్తంభాల వద్దకు చేరుకున్నారు. కన్నుల పండువగా ఊయల ఉత్సవం జరుపుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఉయ్యూరు జనసంద్రంగా మారింది. ప్రధాన సెంటర్‌తో పాటు అమ్మవారి ఆలయం, కాటూరు రోడ్డు, బస్టాండ్‌ రోడ్లు కిక్కిరిశాయి. తిరుగండ దీపాలతో ఉయ్యూరు దేదీప్యంగా వెలిగింది. ఊయల ఉత్సవం అనంతరం అమ్మవారు ప్రధాన రహదారిలోని ఆలయంలో కొలువుతీరారు. అక్కడి నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు.

తొక్కిసలాట.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ఊయల ఉత్సవంలో తొక్కిసలాట జరగగా, త్రుటిలో పెద్దప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అమ్మవారి పల్లకీ ఊయల స్తంభాల వద్దకు వస్తున్న తరుణంలో పోలీసుల రోప్‌వే వైపు నుంచి కాకుండా బారికేడ్లు ఉన్న వైపు నుంచి భక్తులు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. బారికేడ్ల కిందపడి మహిళలు గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు కిందపడిపోయిన వారిని లేపి పరిస్థితి చక్కదిద్దారు.

Updated Date - Feb 10 , 2025 | 12:44 AM