No Bag Day: శనివారం ‘నో బ్యాగ్‌ డే’

ABN, Publish Date - Mar 22 , 2025 | 04:13 AM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘శనివారం.. నో బ్యాగ్‌ డే’గా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్రతిరోజూ నిర్వహించే తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ 2025-26 అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందిస్తోంది. ప్రస్తుతం శనివారంతో సహా వారమంతా ఒకే విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు కొత్తదనం ఉండేలా శనివారం రోజున క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, వృత్తి విద్య అంశాలపై అవగాహన, క్రీడలు, రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు లాంటివి నిర్వహిస్తారు.

No Bag Day: శనివారం ‘నో బ్యాగ్‌ డే’

ఆ రోజు క్విజ్‌లు, డిబేట్లు, ఇతర పోటీలు

2025-26 అకడమిక్‌ క్యాలెండర్‌పై కసరత్తు

అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘శనివారం.. నో బ్యాగ్‌ డే’గా మారనుంది. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్రతిరోజూ నిర్వహించే తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ 2025-26 అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందిస్తోంది. ప్రస్తుతం శనివారంతో సహా వారమంతా ఒకే విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు కొత్తదనం ఉండేలా శనివారం రోజున క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, వృత్తి విద్య అంశాలపై అవగాహన, క్రీడలు, రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు లాంటివి నిర్వహిస్తారు. పాఠ్యాంశాలకు సంబంధిత అంశాలే అయినా రొటీన్‌గా కాకుండా మౌఖిక విధానంలో టెస్ట్‌లు పెడతారు. దీనివల్ల విద్యార్థులకు వారంలో ఒకరోజు కొత్తగా ఉండటంతో పాటు, కొత్త అంశాలపై అవగాహన పెరుగుతుందని పాఠశాల విద్యా వర్గాలు అంటున్నాయి.


ప్రస్తుతం నెలలో మూడో శనివారం నో బ్యాగ్‌ డేగా ఉన్నా అది అమలుకావట్లేదు. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారాన్ని కచ్చితంగా నో బ్యాగ్‌ డేగా అమలుచేయాలని నిర్ణయించారు. కాగా, ఏటా బడులు పునఃప్రారంభమయ్యే జూన్‌లో అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తుండగా, ఇకపై వేసవి సెలవులకు ముందే విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల రెండో వారంలో క్యాలెండర్‌ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం పనిదినాలు 233 ఉంటాయి. అందులో కొన్ని ఆప్షనల్‌ సెలవులుంటాయి. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 04:13 AM