Vontimitta Brahmotsavam Closing: ఒంటిమిట్టలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:22 AM
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రస్నానంతో ముగిశాయి. పుష్కరణిలో చక్రస్నానం అనంతరం రాత్రి ధ్వజావరోహణతో ఉత్సవాలు సంపన్నమయ్యాయి

ఒంటిమిట్ట, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమవారం చక్రస్నానం శాస్ర్తోక్తంగా జరిగింది. ఆలయ సమీపంలోని పుష్కరణిలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం, చక్రత్తల్వార్‌కు అభిషేకాలు చేశారు. అనంతరం కంకణభట్ట్టార్ రాజేశ్‌కుమార్ వేదమంత్రోచ్ఛారణల మధ్య చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించి గరుడ పటాన్ని అవనతం చేయడంతో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.