Ontimitta Kodandarama: నేటి నుంచి కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:09 AM
ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరుగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా సీతారాముల కల్యాణం 11వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నారు.

రాజంపేట, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం, 11 గంటలకు పోతన జయంతి సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణం 11వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 14వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, 15వ తేదీ సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:09 AM