Deputy Pawan Kalyan : అందరికీ సమాన అవకాశాలు లభించాలి
ABN, Publish Date - Mar 21 , 2025 | 05:09 AM
అందరికీ సమాన అవకాశాలు లభించడం కోసం ఎస్సీ వర్గీకరణకు జనసేన సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

ఎస్సీ వర్గీకరణ రూపకర్త చంద్రబాబు.. ప్రక్రియకు జనసేన మద్దతు ఇస్తోంది
అసెంబ్లీ చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
జిల్లా యూనిట్‌గా వర్గీకరణ.. అలా చేస్తేనే సమన్యాయం.. చర్చలో ఎమ్మెల్యేలు
అందరికీ సమాన అవకాశాలు లభించడం కోసం ఎస్సీ వర్గీకరణకు జనసేన సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వర్గీకరణ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ అయితే, వర్గీకరణ రూపకర్త చంద్రబాబు అని, వర్గీకరణ ఫలప్రదాత ప్రధాని మోదీ అని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ అంశం ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అయితే, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
Updated Date - Mar 21 , 2025 | 05:09 AM