Pawan Kalyan: కుమారుడు హెల్త్‌పై పవన్ ఫస్ట్ రియాక్షన్..
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:19 PM
Pawan Kalyan: సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం కారణంగా గాయాలైన మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేదన్నారు. తాను అరకు పర్యటనలో ఉండగా.. తనకు ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 08: సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్ని ప్రమాదం కారణంగా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు గాయాలు కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందంచారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అరకు పర్యటనలో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. తన కుమారుడు మార్క్ శంకర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారన్నారు.
ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని వివరించారు. అయితే ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని తాను ఊహించలేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా ఈ ఘటనపై స్పందించిన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్‌లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్‌లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. రెండు,మూడు అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ భవనంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది రక్షించి బయటకు తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది గాయపడ్డినట్లు సమాచారం. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే చికిత్స పొందుతూన్న వారిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు సింగపూర్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సింగపూర్ పోలీసులు వివరించారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. సింగపూర్‌కు పవన్ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పవన్ వెంట పెద్దన్నయ్య చిరంజీవి దంపతులు వెళ్లనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. స్వయంగా పవన్‌కు ఫోన్ చేశారు కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే సింగపూర్‌లోని ఇండియన్ ఎంబసీకి సైతం ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Manchu Family: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. పోలీస్ స్టేషన్‌లో మనోజ్
Somu Veerraju: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
Dilshuknagar Bomb Blast: దోషుల తరఫున వాదించింది ఎవరంటే..
Chandrababu: చంద్రబాబుకు సొంత ఇల్లు..
Jaipur Bomb Blast Case: జైపూర్ బాంబు పేలుళ్ల కేసు: దోషులకు జీవిత ఖైదు