Pink Cauliflower : గులాబీ రంగులో.. క్యాలీఫ్లవర్
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:57 AM
గులాబీ రంగులో కనిపిస్తున్న ఈ పువ్వు.. క్యాలీఫ్లవర్. సాధారణంగా తెలుపు-పసుపు కలిసిన రంగులో క్యాలీఫ్లవర్‌లు కనిపిస్తుంటాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ రంగు క్యాలీఫ్లవర్లు సాగుచేస్తున్నారు. రాజుపాకలుకు
గులాబీ రంగులో కనిపిస్తున్న ఈ పువ్వు.. క్యాలీఫ్లవర్. సాధారణంగా తెలుపు-పసుపు కలిసిన రంగులో క్యాలీఫ్లవర్‌లు కనిపిస్తుంటాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ రంగు క్యాలీఫ్లవర్లు సాగుచేస్తున్నారు. రాజుపాకలుకు చెందిన అభ్యుదయ రైతు ఢిల్లీ నుంచి ఈ రంగు క్యాలీఫ్లవర్ మొక్కలను తెచ్చారు. వాటిని గ్రామ మాజీ సర్పంచ్ సాగిన దేవుడమ్మ కుమారుడు నాగార్జున సాగు చేశారు. ప్రస్తుతం ఈ క్యాలీఫ్లవర్స్ కోతకు వచ్చాయి. గులాబీ రంగులో ఉన్న ఈ క్యాలీఫ్లవర్లను జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. - చింతపల్లి, ఆంధ్రజ్యోతి
Updated Date - Jan 12 , 2025 | 06:57 AM