Share News

Polavaram Project: గ్యాప్‌-1 డిజైన్లకు జలసంఘం ఓకే

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:04 AM

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ గ్యాప్‌-1 పనులు ప్రారంభమయ్యాయి, దీనికి కేంద్ర జల సంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2027 డిసెంబర్‌ను లక్ష్యంగా పెట్టుకొని పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Polavaram Project: గ్యాప్‌-1 డిజైన్లకు జలసంఘం ఓకే

నేటి నుంచే పనులు ప్రారంభం

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో భాగంగా చేపడుతున్న పోలవరం అధికారులు

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టిన ఇంజనీరింగ్‌ అధికారులు.. గురువారం నుంచి గ్యాప్‌-1 పనులు మొదలుపెడుతున్నారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాంలో (ఈసీఆర్‌ఎ్‌ఫ)లో భాగంగా చేపడుతున్న ఈ గ్యాప్‌-1 పనుల డిజైన్లకు కేంద్ర జల సంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో ఒకవైపు ఉన్న కొండ పక్కగా మట్టి, రాతి కట్టడం పనులు మొదలుపెడుతున్నారు. ఈ కట్టడం ఎత్తు 28 మీటర్లు. 2027 డిసెంబరునాటికి ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంను పూర్తి చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. డయాఫ్రం వాల్‌ పొడవు 1,356.60 మీటర్లు కాగా.. ఇప్పటికి 89.48 మీటర్లు పూర్తయింది. డిసెంబరుకల్లా వాల్‌ పూర్తవుతుందని అంటున్నారు. కుడి, ఎడమ కనెక్టివిటీలను 2027 జూలై నాటికే పూర్తి చేస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. కాగా.. అంతర్జాతీయ నిపుణులు వచ్చే నెలలో మరోసారి ప్రాజెక్టును సందర్శించనున్నారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:04 AM