సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు
ABN, Publish Date - Jan 16 , 2025 | 12:08 AM
కనిగిరి ప్రాంతంలో ఏ విద్యార్థి చదువు మధ్యంలో ఆగకుండా చూడాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కంచర్లవార్లిపల్లి హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా హాస్టల్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోని చాలామంది పేదవర్గాల వారు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
- విద్యార్థుల చదువు మధ్యలో ఆగరాదన్నదే లక్ష్యం
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): కనిగిరి ప్రాంతంలో ఏ విద్యార్థి చదువు మధ్యంలో ఆగకుండా చూడాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కంచర్లవార్లిపల్లి హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా హాస్టల్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోని చాలామంది పేదవర్గాల వారు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ప్రోత్సాహంలేకపోవడంతోపాటు వారి కుటుంబాలు ఆర్థికంగా వెనుకుబడి ఉండటమే అందుకు కారణమన్నారు. ప్రతి గ్రామంలో ఏఏ కుటుంబాల్లో చిన్నారులు చదువుకు దూరంగా ఉంటున్నారో గుర్తించి వారిని బడిబాట పట్టించేలా అధికారులు మరింత చొరవ చూపాలని కోరారు. విద్యనభస్యసించటానికి ఆర్థిక ఇబ్బందులు కారణంకాకూడదనే ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. సంక్షేమ హాస్టళ్ళలో మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పనతో పాటు నాణ్యమైన భోజన వసతిని కల్పించి పేదవర్గాల వారిని విద్యాపరంగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. కనిగిరి ప్రాంతలో హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యలను త్వరతిగతిన పరిష్కరిస్తామన్నారు. హాస్టల్‌లో మెరుగైన భోజనవసతితో పాటు సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధులు సమీకరణకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు చెప్పారు. కొన్ని హాస్టళ్లను పరిశీలించినపుడు విద్యార్థులకు మెరుగైన వసతులు లేకపోవటం బాధ కల్గించిందన్నారు. తనశక్తి మేర అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. తాను సంకల్పించిన ప్రతి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి చేయూత ఇస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, పోతు కొండారెడ్డి, నంబుల వెంకటేశ్వర్లు, వీర్ల కిషోర్, కొత్తూరు రవి, వడ్డెంపూడి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 16 , 2025 | 12:08 AM