ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా భోగి పర్వదినం

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:23 AM

భోగి పర్వదినాన్ని ప్రజలు వేడుకగా నిర్వహించుకున్నారు. సోమవారం తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేశారు.

గిద్దలూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): భోగి పర్వదినాన్ని ప్రజలు వేడుకగా నిర్వహించుకున్నారు. సోమవారం తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేశారు. కుటుంబాల వారు ఒకచోట అందరూ కలిసి ఉమ్మడిగా భోగిమంటలు వేసుకుని ఒకరికొకరు శుభా కాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం భోగి పర్వదినం, అలాగే సోమవారం, ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి ఒకే రోజు రావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివునికి పంచామృతాభిషేకాలు చేశారు. భోగి పండ్లతో అభిషేకం చేశారు. పలు ఆలయాల్లో అన్నాభిషేకం చేశారు. అమ్మవారిశాలలో భోగిపర్వదినం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం చిన్నారులకు తల్లిదండ్రులు, బంధుమిత్రుల మధ్య భోగిపండ్లు పోసి వేడుకలు నిర్వహించారు. రాచర్ల మండలం అనుమలవీడులో భోగి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి నంది అవార్డు గ్రహితలతో చింతామణి పౌరాణిక ఉచిత నాటకాన్ని ప్రదర్శించారు.

త్రిపురాంతకం : ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల నుండి పూజలు చేస్తున్న భక్తులు భోగి సందర్బంగా గోదా రంగనాయకస్వామి కల్యాణం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని వేంకటేశ్వరాలయంలో అర్చకులు ఎం.రామశ్రీనివాసరావు ఆద్వర్యంలో స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. అర్చకులు కె.రవి ఆధ్వర్యంలో పాతరామాలయం వద్ద వేంకటేశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని, ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు, అన్నప్రసాద కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు.

పొదిలి : మండలంలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం భోగి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ బద్ధంగా గ్రామీణులు భోగి పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. తెల్లవారు జామునే లేచి ప్రతి ఇంటిముందు భోగిమంటలు వేశారు. అంతేకాకుండా ప్రతి ఇంటిముందు రంగురంగుల రంగవళ్లులతో తీర్చి దిద్దారు.

వైభవంగా గోదాదేవి కల్యాణం

సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, వేణుగోపాలస్వామి దేవాలయం, విశ్వనాథపురం రాములవారి దేవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో స్వామివారిని ఉంచి కల్యాణం నిర్వహించారు.

కంభం : కంభం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం భోగి పండుగను పురష్కరించుకుని శ్రీగోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీరంగనాథస్వామి సమేత గోదాదేవి కళ్యాణానికి భక్తులు పట్టువస్త్రాలు, పూలు, పండ్లు అందజేశారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మ వార్లకు భోగిపండ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కంభంలోని శ్రీ కోటా సత్యమాంబదేవికి విశేష అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారికి బోనాలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ముగ్గుల పోటీలు

గిద్దలూరు : సంక్రాంతి వేడుకల్లో భాగంగా శ్రీకోటాసత్యమాంబదేవి గుడి ప్రాంగణంలో మంగళ వారం సాయంత్రం 3 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విజేతలకు ప్రత్యేక బహుమతులతోపాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.

తర్లుపాడు : మండలంలో భోగి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే లేచి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేశారు. ఇళ్ల ఎదుట రంగవల్లులు వేసి సాంప్రదాయబద్ధంగా చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వచనం చేశారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం ఎదుట గ్రామస్తులు భోగి మంటలు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కాపురం పట్టణంలో సోమవారం భోగి పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెల్లవారు జామున మహిళలు ఇళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దారు. అనంతరం ఆయా వీధులలో పెద్దఎత్తున దుంగలు, గడ్డి, ఇళ్లల్లోని పాత సామాన్లు వేసి భోగి మంటలు ఏర్పాటు చేశారు. భోగి మంటల వెలుగుల్లో నవచైతన్యంతో జీవితంలో ప్రేమ, శాంతి పొందాలని, పాతను వదిలి కొత్తదనాన్ని నింపుకోవాలని ఆశీస్తూ భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ నృత్యాలు చేశారు. ఇళ్ల వద్ద బొమ్మలకొలువులు తీర్చిదిది చిన్నారులకు భోగిపండ్లు పోశారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : ధనుర్మాసాన్ని పురస్క రించుకొని స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణం సోమవారం కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి మూల విరాట్‌కు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తికి శ్రీరంగనాథుని అలంకారంలో గోదాదేవితో కళ్యాణ ఘట్టాలు నిర్వహించారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో భక్తబృందం ప్రత్యేక పూజలు, భక్తి గీతాలు నిర్వహించారు. గోదాదేవి కల్యాణం తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

కొమరోలు : మండలంలోని అన్ని గ్రామాల్లో తెలుగువారి ముఖ్యపండుగ సంక్రాంతిని తొలిరోజు భోగి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఉల్లాసంగా నిర్వ హించారు. భోగి పర్వదినం సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటిముందు రంగురంగు ముగ్గులతో అలంకరించారు. ఇంటి ముందు తెల్లవారుఝామునే భోగిమంటలను వేశారు. సూదూర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో యువత గ్రామాల్లోకి చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. మండలంలోని అన్ని దేవా లయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఇడమకల్లు శ్రీ గుంటి లక్ష్మినరశింహ స్వామి దేవాలయంలో పూజారి కృష్ణామాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

పెద్ద్ద దోర్నాల : భోగి పర్వదినం సందర్భంగా వేకువ జామునే గ్రామాలో భోగి మంటలు వేశారు. ప్రధానంగా మహిళలు, యువతులు తమ లోగిళ్ల ముందు రంగు రంగుల రంగవల్లులతో శోభాయ మానంగా తీర్చిదిద్దారు. అనంతరం భోగి మంటలు వేసి ఉత్తరాయాణానికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో హరిదాసులు వీధుల్లో కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని స్తుతిస్తూ కీర్తనలు పాడారు. తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేశారు. వేడుకల్లో భాగంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సుదర్శానాచార్యులు శాస్త్రోత్తంగా గోదాదేవి రంగనాయకునికి వివాహం జరిపించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో వివాహ క్రతువును తిలకించి స్వామి వార్లను సేవించారు.

Updated Date - Jan 14 , 2025 | 12:23 AM