ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొక్కుబడిగా కేంద్ర బృందం పర్యటన

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:57 PM

దేశ స్థాయిలో ఒకే జిల్లా, ఒకే ఉత్పత్తి నినాదంతో స్థానిక స్థితిగతులను పరిశీలించేందుకు గురువారం చీరాల వచ్చిన కేంద్ర బృందం పర్యటన మొక్కుబడిగా సాగింది. కేంద్ర బృంద సభ్యుల ఇష్‌దీప్‌, డాక్టర్‌ దివ్య ఇతర అధికారులతో కలసి షెడ్యూల్‌ ప్రకారం నిర్దేశిత ప్రాంతాలను సందర్శించేందుకు ఏర్పడిన అవాంతరాలతో జాండ్రపేటలో పలు మగ్గాలను పరిశీలించారు.

మగ్గాలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

చేనేతరంగ ప్రతినిధులకు అందని సమాచారం

చీరాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : దేశ స్థాయిలో ఒకే జిల్లా, ఒకే ఉత్పత్తి నినాదంతో స్థానిక స్థితిగతులను పరిశీలించేందుకు గురువారం చీరాల వచ్చిన కేంద్ర బృందం పర్యటన మొక్కుబడిగా సాగింది. కేంద్ర బృంద సభ్యుల ఇష్‌దీప్‌, డాక్టర్‌ దివ్య ఇతర అధికారులతో కలసి షెడ్యూల్‌ ప్రకారం నిర్దేశిత ప్రాంతాలను సందర్శించేందుకు ఏర్పడిన అవాంతరాలతో జాండ్రపేటలో పలు మగ్గాలను పరిశీలించారు. ఆ మగ్గాలపై తయారయ్యే వస్త్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక చేనేత రంగ ప్రతినిధులకు తగిన సమాచారం లేకపోవడంతో వారు ఎప్పుడు వచ్చి, ఎప్పుడు వెళ్లారో కూడా తెలీలేదని పలువురు చేనేతరంగ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హ్యాండ్లూమ్‌ జేడీ కన్నబాబు, డీడీ నాగేశ్వరరావు, ఆర్‌డీడీ భీమయ్య, ఏడీలు వనజ, నాగమల్లీశ్వరరావు, పలువురు చేనేతరంగ ప్రతినిఽధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:57 PM