ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోటాపోటీగా పొట్టేళ్ల బలప్రదర్శన పోటీలు

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:48 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఉప్పుగుండూరు గ్రామంలోని ఊరచెరువులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.

ఉప్పుగుండూరులో పొట్టేళ్ల పోటీలను తిలకిస్తున్న జనం

ఉప్పుటూరుకు ప్రథమ బహుమతి

నాగులుప్పలపాడు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఉప్పుగుండూరు గ్రామంలోని ఊరచెరువులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈపోటీలలో ఉప్పుటూరుకు చెందిన పొట్టేలు సత్తా చాటి విజేతగా నిలిచింది. పోటీలను తిలకించేందుకు వచ్చిన అశేష జనవాహిని కేరింతలు, ఉత్సాహం, చప్పట్లు నడుమ పొట్టేళ్ల బలప్రదర్శన సాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 పొట్టేళ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. నిర్వాహకులు రెండు రౌండ్లుగా పోటీలను నిర్వహించారు. ఉప్పుటూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి పోలేరమ్మకు చెందిన పొట్టేలు మొదటి బహుమతి, ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన మద్దిసాని సుబ్బారావు పొట్టేలు రెండవ బహుమతి, ఎనికపాడుకు చెందిన యద్దనపూడి వెంకటే్‌షకు చెందిన పొట్టేలు మూడవ బహుమతి ,చినగంజాం ధీరకు చెందిన పొట్టేలు నాల్గవ బహుమతి సాధించాయి. తొలుత సేవా సమితి సభ్యులు గ్రామంలో పోటీల జ్యోతి ప్రజ్వలన, ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ వద్దనున్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 18 న ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 11:48 PM