ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:54 PM

ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులో రూ.కోటి వ్యయంతో దాతల సహకా రం, ఎమ్మెల్యే ఏలూరి సౌజన్యంతో నిర్మించిన హిందూ శ్మశానవాటికను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. మహాప్రస్థాన కమిటీ అధ్యక్షుడు కఠారి సురేంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏలూరి మాట్లాడుతూ దాతల సహకారం, గ్రామస్థుల ఐక్యతకు ఈ శ్మశానవాటిక నిదర్శనమన్నారు. ప్రజల చివరి మజిలీ ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని వసతులతో శ్మశానవాటిక నిర్మాణానికి కమిటీ కృషిని ఆయన అభినందించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (ఇన్‌సెట్‌లో) శివలింగాన్ని ప్రారంభిస్తున్న ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి రూ.కోటి వ్యయంతో నిర్మించిన

మహాప్రస్థానం ప్రారంభం

పర్చూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఏ లూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులో రూ.కోటి వ్యయంతో దాతల సహకా రం, ఎమ్మెల్యే ఏలూరి సౌజన్యంతో నిర్మించిన హిందూ శ్మశానవాటికను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. మహాప్రస్థాన కమిటీ అధ్యక్షుడు కఠారి సురేంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏలూరి మాట్లాడుతూ దాతల సహకారం, గ్రామస్థుల ఐక్యతకు ఈ శ్మశానవాటిక నిదర్శనమన్నారు. ప్రజల చివరి మజిలీ ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని వసతులతో శ్మశానవాటిక నిర్మాణానికి కమిటీ కృషిని ఆయన అభినందించారు. మహాప్రస్థా నం అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన కఠారి శ్రీకృష్ణ జ్ఞాపకార్థం డిప్యూటీ కలెక్టర్‌ కఠారి రమేష్‌ నాయుడు, ధర్మపత్ని కమర్షియల్‌ టాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగజ్యోతి చూపిన చొరవను ఏలూరి కొనియాడారు. దాతల నుంచి విరాళాలను సేకరించి శ్మశానాన్ని అభివృద్ధి చేసిన కఠారి సురేంద్రబాబును అభినందించారు. అనంతరం రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే ఏలూరి సహకారం ఎనలేనిదన్నారు. అనంతరం శ్మశానవాటికలోని వివిధ భవనాలు, శిలాఫలకాలు, మహాశివుని విగ్రహాన్ని ఎమ్మెల్యే ఏలూరి తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో బాపట్ల అర్చన్‌ డెవలప్‌ మెంట్‌ చైర్మన్‌ సలగల రాజశేఖర్‌, పల్లా గిరిజారాయుడు, నర్రా వెంకట్‌, ఒగ్గిశెట్టి గోవిందరాజులు, కోట హరిప్రసాద్‌, ఒగ్గిశెట్టి నరసింహం, కొల్లా వెంకన్న, మంగళగిరి కోటేశ్వరరావు, రావి సత్యనారాయణ, గడ్డిపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

డంపింగ్‌ యార్డుగా

శ్మశానం తనను కలచివేసింది

డిప్యూటీ కలెక్టర్‌ కఠారి రమేష్‌ నాయుడు

‘డంపింగ్‌ యార్డలా శ్మశాన వాటిక’ శీర్షికతతో ఆంధ్రజ్యోతిలో వ్చిన కథనం తతను కలచివేసిందని, చివరి మజిలీ అ యిన మహాప్రస్థానాన్ని తన తండ్రి జ్ఞాపకార్థం తాను భాగస్వామ్యం కావడం సం తోషాన్ని ఇచ్చిందన్నారు. దాతల సహకారం, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:54 PM