మూడేళ్లగా అద్దెభవనంలోనే వసతిగృహం
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:53 AM
వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వలేదు. ఇందుకు పట్టణంలోని బీసీ బాలుర హాస్టలే ఉదాహరణ.

గిద్దలూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వలేదు. ఇందుకు పట్టణంలోని బీసీ బాలుర హాస్టలే ఉదాహరణ. పట్టణంలోని కొంగళవీడు రోడ్డులో సొంతభవనంలో బీసీ బాలుర వసతి గృహం నడుస్తోంది. కాలక్రమేణ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. శ్లాబ్ పెచ్చులూడి పడు తుండడంతో వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం తాత్కాలికంగా ఎస్‌వీ కాలనీలోని ఓ అద్దెభవనంలోకి మార్చారు. మూడేళ్లు గడిచినా, భవన నిర్మాణం చేపట్టలేదు. దీంతో సుమారు 70 మంది విద్యార్థులు మూడేళ్లుగా అద్దె భవనానికే పరిమితమయ్యారు. విద్యాభివృద్ధికి అది చేశాం, ఇది చేశాం అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం కనీసం నాడు- నేడు కార్యక్రమంలోనైనా నూతన హాస్టల్ భవ నానికి నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వమైనా శిథిలా వస్థకు చేరిన పాత భవనాన్ని పడగొట్టి నూతన భవనాన్ని నిర్మించాలని హాస్టల్ విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరి మూతపడిన హాస్టల్ గదుల్లో రాత్రివేళల్లో అసాంఘీక కార్యకలా పాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు స్పందించి బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల కోసం నూతన భవనాన్ని నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:53 AM