నారాయణస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు అంచనాలు

ABN, Publish Date - Feb 09 , 2025 | 10:20 PM

సీఎస్‌పురం మండలంలోని మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈవో నరసింహాబాబు తెలిపారు. ఆదివారం దేవదాయ, గుంటూరు జోన్‌ ఇంజనీర్‌ విభాగానికి చెందిన సీహెచ్‌ శ్రీనివాసులు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు దేవస్థానాన్ని సందర్శించారు.

నారాయణస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు అంచనాలు
ఆలయ మ్యాప్‌ను పరిశీలిస్తున్న దేవదాయ ఇంజనీర్‌ సీహెచ్‌ శ్రీనివాసులు

సీఎస్‌పురం(పామూరు), ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండలంలోని మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈవో నరసింహాబాబు తెలిపారు. ఆదివారం దేవదాయ, గుంటూరు జోన్‌ ఇంజనీర్‌ విభాగానికి చెందిన సీహెచ్‌ శ్రీనివాసులు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు దేవస్థానాన్ని సందర్శించారు. ఈసందర్భంగా దాతల సహకారంతో చేపట్టనున్న మహాప్రాకార మండపం నిర్మాణం, జాతీయ రహదారి నుంచి దేవస్థానానికి వచ్చే దారిలో ఆర్చి నిర్మాణం, అన్నదాన బిల్డింగ్‌, రేకుల షెడ్డులు, భక్తుల అవసరాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి అంచనాల తయారు చేయడానికి కొలతలను తీసుకొన్నారు. త్వరలో మహాప్రాకార మండపాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చినఆదినారాయణ, వెంకట్రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పామూరులోని శ్రీమదన వేణుగోపాలస్వామి, వల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానంలో నూతన నిర్మాణాలకు ఇంజనీరింగ్‌ అధికారులు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. కల్యాణ మండపం, వేంకటేశ్వస్వామి ఆలయ నిర్మాణం, వరదరాజ స్వామి ఆలయ మండపం, కోనేరు పునఃప్రారంభం, యాగశాల నిర్మాణం చేపట్టబోతున్నట్లు ఈవో నరసింహాబాబు తెలిపారు.

దేవస్థానంలో పూజలు

మండలంలోని మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు ఆదివారం పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామి వారికి మహానైవేద్యాన్ని మేళతాళాలతో రాజగోపురం వద్ద నుంచి ఆలయ ప్రదక్షిణలు చేస్తూ స్వామి వారికి సమర్పించారు. అనంతరం గోశాలలోని గోవులకు పసుపు, కుంకుమాలతో పూజలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు కొమ్మినేని చినఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 10:21 PM