పోలూరు, అనంతవరం ఫిల్టర్ బెడ్‌లకు నిధులు
ABN, Publish Date - Feb 09 , 2025 | 10:27 PM
యద్దనపూడి మండలంలోని రెండుగ్రామాలకు చెందిన ఫిల్టర్ బెడ్‌లకు డీఎంఎఫ్ నిధులు రూ.18.50లక్షల మంజూరుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి చేశారు. ఈ మేరకు అనంతవరానికి రూ.10లక్షలు, పోలూరుకు రూ.8.50లక్షలు రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు నిధులు మంజూ రు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యే క కృషితో కలెక్టర్, చైర్మన్ జే వెంకటమురళి డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమ్మెల్యే ఏలూరి కృషితో 18.50లక్షలు మంజూరు
యద్దనపూడి, (మార్టూరు) ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : యద్దనపూడి మండలంలోని రెండుగ్రామాలకు చెందిన ఫిల్టర్ బెడ్‌లకు డీఎంఎఫ్ నిధులు రూ.18.50లక్షల మంజూరుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి చేశారు. ఈ మేరకు అనంతవరానికి రూ.10లక్షలు, పోలూరుకు రూ.8.50లక్షలు రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు నిధులు మంజూ రు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యే క కృషితో కలెక్టర్, చైర్మన్ జే వెంకటమురళి డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు గ్రామాలలో ఫిల్టర్ బెడ్‌లు సక్రమంగా లేకపోవడంతో గ్రామాలలో ప్రజలకు రక్షిత తాగునీరు అందడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ గ్రామ నాయకులు ఎమ్మెల్యే ఏలూరి దృష్టికి సమస్య ను విన్నవించారు. దాంతో ఏలూరి రెండు గ్రామాలలోని ఫిల్టర్ బెడ్‌ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అంచనాలు మేరకు అంచనా వ్యయం రూ.10లక్షలు, రూ.8.50లక్షలు అడ్మినిస్రేటివ్ శాంక్షన్ ఆర్డ్డర్ జారీ విడివిడిగా జారీ చేశారు. దాంతో పోలూరు, అనంతవరం గ్రామస్థులు త్వరలో ఫిల్టర్ బెడ్‌లను మరమ్మతు చేసిన తర్వాత సురక్షితమైన తాగు నీటిని గ్రామాలలో పంపిణీ చేస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Feb 09 , 2025 | 10:27 PM