పల్లె ప్రగతికి గోకులాలు దోహదం
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:55 PM
పల్లె ప్రగతికి ప్రభుత్వం గోకులాలకు అందిస్తతన్న సహ కారం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య అన్నారు. చీరాల నియోజకవర్గంలో రూ.2.27కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 97 గోకులాలకు సంబంధించి శనివారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. అక్కాయిపాలెంలో 16, చల్లారెడ్డిపాలెంలో 19 గోకులాల షెడ్లు, ఒక షీప్ షెడ్‌ను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు.
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, జనవరి 11(ఆంధ్రజ్యోతి) : పల్లె ప్రగతికి ప్రభుత్వం గోకులాలకు అందిస్తతన్న సహ కారం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య అన్నారు. చీరాల నియోజకవర్గంలో రూ.2.27కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 97 గోకులాలకు సంబంధించి శనివారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. అక్కాయిపాలెంలో 16, చల్లారెడ్డిపాలెంలో 19 గోకులాల షెడ్లు, ఒక షీప్ షెడ్‌ను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ వృత్తిగా ఉన్న పశుపోషణ, జీవాల పెంపకానికి అందిస్తున్న చేయూతను ఆయా వర్గాలవారు వినియోగించుకోవాలని కొండయ్య సూచించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసే, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 11:55 PM