అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డిని

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:32 PM

అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు, ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌ ఖోఖో పోటీలో విశ్వ విజేతగా నిలిచి భారత్‌ జట్టులో ప్రాతినిఽథ్యం పొందిన పి.శివారెడ్డిని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సత్కరించారు. ప్రపంచకప్‌ ఖోఖో పోటీలో భారత్‌ జట్టులో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారుడు శివారెడ్డికి దీర్ఘకాలం పంగులూరు ఎస్‌ఆర్‌ ఆర్‌ అకాడమీలో శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ఖోఖో అసోషియేషన్‌ కార్యదర్శి యం.సీతారామిరెడ్డి ఆదివారం మంత్రి గొట్టిపాటిని చిలకలూరిపేటలోని ఆయన నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డిని
అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి, తండ్రి గురవారెడ్డిని సన్మానిస్తున్న మంత్రి గొట్టిపాటి

ప్రశంసించిన మంత్రి గొట్టిపాటి

పంగులూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు, ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌ ఖోఖో పోటీలో విశ్వ విజేతగా నిలిచి భారత్‌ జట్టులో ప్రాతినిఽథ్యం పొందిన పి.శివారెడ్డిని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సత్కరించారు. ప్రపంచకప్‌ ఖోఖో పోటీలో భారత్‌ జట్టులో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారుడు శివారెడ్డికి దీర్ఘకాలం పంగులూరు ఎస్‌ఆర్‌ ఆర్‌ అకాడమీలో శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ఖోఖో అసోషియేషన్‌ కార్యదర్శి యం.సీతారామిరెడ్డి ఆదివారం మంత్రి గొట్టిపాటిని చిలకలూరిపేటలోని ఆయన నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఖోఖో క్రీడలో అంచెలంచలుగా ఎదిగి భారత్‌ జట్టులో తెలుగు రాష్ర్టాల నుంచి స్థానం పొంది భారతజట్టు విజేతగా నిలిచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నందన్నారు. యువత క్రీడలపట్ల ఆసక్తి చూపాలని, శివారెడ్డి భావి యువతకు ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు. రాష్ర్టానికి, జిల్లాకు పేరు తెచ్చిన శిక్షణ యిచ్చిన పీడీ సీతారామిరెడ్డిని, శివారెడ్డి తండ్రి గురవారెడ్డిని అభినందించారు. ప్రపంచకప్‌ ఖోఖో పోటీలలో శివారెడ్డికి బెస్ట్‌ చేజర్‌ అవార్డ్‌ పొందింన విషయాన్ని కార్యదర్శి సీతారామిరెడ్డి మంత్రి గొట్టిపాటికి వివరించారు. కార్యక్రమంలో పంగులూరు టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌, పలువురు ఖోఖో క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:32 PM