ఎల్‌ఈడీ దీపాల కొనుగోళ్లపై విచారణ

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:46 AM

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ దీపాలు అధిక ధరలకు కొనుగోలు చేశారనే ఆరోపణలపై బుధవారం కనిగిరి డీఎల్‌పీవో హనుమంతరావు విచారణ చేపట్టారు.

ఎల్‌ఈడీ దీపాల కొనుగోళ్లపై విచారణ

మద్దిపాడు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ దీపాలు అధిక ధరలకు కొనుగోలు చేశారనే ఆరోపణలపై బుధవారం కనిగిరి డీఎల్‌పీవో హనుమంతరావు విచారణ చేపట్టారు. 2021 నుంచి ఇప్పటివరకు ఎల్‌ఈడీ దీపాలను అధికధరలకు కొనుగోలు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని బీజేపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌.వెంకటరమణ లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఈక్రమంలో మద్దిపాడు పంచాయతీ కార్యాలయంలో ఈ మేరకు రికార్డులను పరిశీలించారు.

Updated Date - Mar 13 , 2025 | 12:46 AM