ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా జాళ్లపాలెం తిరునాళ్ల

ABN, Publish Date - Mar 30 , 2025 | 10:34 PM

ఉగాది సందర్భంగా కొండపి మండలంలోని జాళ్లపాలెం వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల ఆదివారం వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.

ఏర్పాటుచేసిన ప్రభలు

వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి పోటెత్తిన భక్తులు

నాలుగు విద్యుత్‌ ప్రభల ఏర్పాటు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కొండపి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ఉగాది సందర్భంగా మండలంలోని జాళ్లపాలెం వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల ఆదివారం వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. పొంగళ్లు పెట్టుకొని, తలనీలాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకొన్నారు. మఠం వద్ద ఉన్న ధునిలో ఎండు కొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు తిరునాళ్లకు వచ్చిన వారికి పులిహోర, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశాయి. మఠం పరిసరాల్లో వివిధ సంఘాల వారు ఉచితంగా అన్నదానం చేశారు. పెట్లూరు పీహెచ్‌సీ సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాత్రికి వివిధ గ్రామాలకు చెందిన వారు నాలుగు విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. వాటిపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాట కచేరీలు అలరించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న సత్య

వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆదివారం రాత్రి ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య దర్శించుకున్నారు. ఈసందర్భంగా మఠం నిర్వాహకులు సత్యకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రభలపై ప్రజలను ఉద్దేశించి సత్య మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రైవేటు నిర్వాహకులు చిన్నారుల ఆహ్లాదం, ఆనందం కోసం జెయింట్‌వీల్‌, మినీ ట్రైన్స్‌, జారుడు బల్లలు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నం, పులిహోర, మంచినీరు బాటిళ్లు, మజ్జిగ ఉచితంగా అందజేశారు. ముగ్గురు సీఐలు, పదిమంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 30 , 2025 | 10:34 PM