ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరకట్నం వేధింపులకు వివాహిత బలి

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:31 AM

వరక ట్నం వేధింపులకు వివాహిత బలి అయింది. ఈ సంఘటన బుధవారం రాత్రి హైదరాబాద్‌ లో జరగగా గురువారం ఒంగోలులో తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో మృతి

ఒంగోలులో కేసు నమోదు

హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ

ఒంగోలు క్రైం, మార్చి27(ఆంధ్రజ్యోతి): వరక ట్నం వేధింపులకు వివాహిత బలి అయింది. ఈ సంఘటన బుధవారం రాత్రి హైదరాబాద్‌ లో జరగగా గురువారం ఒంగోలులో తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. బల్లికురవ మండలం పొత్తూరు చెందిన సోమిశెట్టి వాసం తి(28), ఒంగోలు నగరం శ్రీనివాసనగర్‌కు చెం దిన పగిడి రవి మూడేళ్ళ క్రితం ప్రేమించుకు న్నారు. వారిది ఒకే కులం కావడంతో పెద్దలు అంగీకరించి పెళ్లి చేశారు. వారికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. వారు హైదరాబాద్‌ బీరంగూ డాలో కాపురం పెట్టారు. అయితే ఏడాది క్రి తం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన రవి జాబ్‌ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. అప్పటి నుంచి వాసంతికి వేధింపులు మొదలయ్యాయి. అటు అత్తమామలు, ఇటు భర్త రవి నిత్యం వే ధింపులు చేస్తున్నారని వాసతి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే సమయంలో బుధవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా వాసం తి తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. అయితే రాత్రి 12 గంటల తరువాత రవి వాసంతి తండ్రికి ఫోన్‌ చేసి మీ అమ్మాయి ఉరేసుకుని మృతి చెందిందని తెలిపారు. తెల్ల వారే సరికి ఆమె మృతదేహాన్ని ఒంగోలులోని రవి ఇంటికి చేర్చారు. అయితే వాసంతి శరీ రంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన తల్లిదం డ్రులు తాలుకా పోలీసులను ఆశ్రయించి తన కుమార్తెను హత్య చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గృహ హింస కింద కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తాలుకా సీఐ అజయ్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. హైద రాబాద్‌లో వాసంతి మృతిపై అక్కడ పోలీసుల కు ఫిర్యాదు చేయకుండా ఒంగోలు తీసుకురా వడం ఏమిటని మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:31 AM