గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:42 AM
వేసవి కాలం దృష్టా గ్రామాల్లో తాగనీటి సమ స్యలు రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చ ర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్ద న్ ఆదేశించారు.

ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు(రూరల్), మార్చి 14(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం దృష్టా గ్రామాల్లో తాగనీటి సమ స్యలు రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చ ర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్ద న్ ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వ సభ్యస మావేశం ఎంపీపీ పి.మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హా జరైన ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గ్రామా ల్లో తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు సాగర్‌నీటితో చెరువులను పూర్తిగా నింపాలన్నా రు. గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర మోటార్లు మరమ్మతులు చేయించాలని చెప్పారు. ఎంపీడీ వో, ఈవోఆర్డీలు గ్రామాల్లో వారానికి రెండు రో జులు పర్యటించి పరిశీలించాలని కోరారు. ఒం గోలు నగరం పూర్తిగా కాంక్రీట్ జంగిల్ అయిం దని, ఈక్రమంలో నగరంతో పాటు గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టా లని కోరారు. నివేశన గృహాలు అవసరమైన వారి పేర్లు పంచాయతీ కార్యదర్శులు సేకరిం చాలన్నారు. ఒంగోలు నగరంలో పేదలకు 2సెం ట్లు, గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు ఇవ్వటానికి అవసరమైన స్థలాలు పరిశీలించాలని ఆదేశించా రు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా మండల వ్యవసాయశాఖ అధి కారి సమాచారం వారిని అందించాలన్నారు. ఐ దు ఎకరాల్లోపు విస్తీర్ణం గల చెరువులుకు వాకి ంగ్‌ట్రాక్, చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తామని ఎమ్మె ల్యే దామచర్ల వివరించారు. శ్మశానాలకు చుట్టూ ప్రహరీలు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, అందువల్లో షెడ్డులాంటివి నిర్మిస్తామన్నారు. పా తపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు వ చ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో ఎంపీడీవో కె.రాజశేఖర్‌రావు, తహసీల్దార్ కె. వాసు, ఈవోఆర్డీ ఎ.బాలచెన్నయ్య, ఏవో శేషుబా బు, కరవది పీహెచ్‌సీ వైద్యాధికారి సుందరప్ర సాద్, పశువైద్యాధికారి వై.భూపాల్‌రెడ్డి, ఏవో కి షోర్‌బాబు, ఉద్యానశాఖ అధికారి ప్రత్యూష, పీ ఆర్ ఏఈ రామ్‌ప్రసాద్, ఎంపీటీసీలు వాణి, పా లేటి శ్రీనివాసరావు, గుండపనేని శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, సర్పంచ్‌లు మండవ వెంకటసు బ్బయ్య, కోదండరామిరెడ్డి, మురళి పాల్గొన్నారు.
Updated Date - Mar 15 , 2025 | 12:42 AM