ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:06 AM

షెడ్యూల్‌ కులాల ఉప వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌మిశ్రా ఏకసభ్య కమిషన్‌ ఈనెల 5,6 తేదీల్లో జిల్లాలో పర్యటించనునుంది. ఈనేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది.

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో చినఓబులేషు, వేదికపై సాంఘిక సంక్షేమశాఖాధికారి లక్ష్మానాయక్‌

5,6 తేదీల్లో రాజీవ్‌ రంజన్‌మిశ్రా పర్యటన

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : షెడ్యూల్‌ కులాల ఉప వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌మిశ్రా ఏకసభ్య కమిషన్‌ ఈనెల 5,6 తేదీల్లో జిల్లాలో పర్యటించనునుంది. ఈనేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. అందులో భాగంగా బుధవారం ప్రకాశం భవన్‌లో జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేషు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. బందోబస్తుతోపాటు వసతి కల్పించాలన్నారు. మిశ్రా పర్యటనకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని షెడ్యూల్‌ కులాల ప్రజలు, ఉద్యోగులు, కులసంఘాల నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్‌ మాట్లాడుతూ 5వతేదీ ఉదయం పది గంటలకు జిల్లా అధికారులతో రాజీవ్‌ సమీక్షిస్తారని తెలిపారు. అనంతరం దళిత, ప్రజాసంఘాలు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.

Updated Date - Jan 02 , 2025 | 01:06 AM