పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి
ABN, Publish Date - Apr 03 , 2025 | 02:24 AM
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేసేందుకు ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకుల డిమాండ్
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఒంగోలు విద్య, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేసేందుకు ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యురాలు చెన్నుపాటి మంజుల మాట్లా డుతూ 11వ వేతన సవరణ కమిషన్ ముగిసి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ప్రభుత్వం కొత్తది ఏర్పా టు చేయకపోవడం దారుణమన్నారు. సీపీఎస్, జీపీఎస్‌లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయడంతోపాటు 2003 డీఎస్సీ వారికి కేంద్రప్రభుత్వ మెమో ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 70ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలు చేయాలన్నారు. 117 జీవోను రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్య మాన్ని కూడా అమలు చేయాలని, ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలో ఉన్న తప్పులను సవరించి మెరిట్ కం రోస్టర్ ప్రకారం రీ ఆర్గనైజ్ చేయాలని కోరారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వాటన్నింటిని వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎస్‌ఎండీ రఫీ, వి.మాధవరావు, జయరావు, వై.వెంకట్రావు, ఎస్‌కే అబ్దుల్‌హై, వి.జనార్దన్‌రెడ్డి, బి.వెంకట్రావు, కె.శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాసులు, పి.వెంకట్రావు, జీవీకే కీర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 03 , 2025 | 02:24 AM