ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్సాహంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 13 , 2025 | 12:49 AM

మానవతా స్వచ్చందసేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ గార్డెన్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

పొదిలి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : మానవతా స్వచ్చందసేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ గార్డెన్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మహిళల ముగ్గుల పోటీలు, కోలాటం, కుర్చీలాట, హరిదాసుల కీర్తనలు సాంప్రదాయ వంట కాలు కళ్లకు కట్టేలా తెలియజేస్తూ అలరించాయి. ముందుగా మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని ముగ్గు లను అందంగా అలంకరించారు. వనజాక్షీ ఆధ్వర్యంలో మార్కాపురం నుంచి వచ్చిన కోలాటబృదం ప్రదర్శించిన కోలాటం అక్కడికి వచ్చిన ప్రజలను ఎంతగానో అలరించింది. మహమ్మద్‌ రఫీ, బండి అశోక్‌ బృదంతో ఏర్పాటు చేసిన పాటకచేరి, నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా సాంప్రదాయ వంటకాలను తయారు చేసి కార్యక్రమా నికి వచ్చిన ప్రజలకు రుచి చూపించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లా డుతూ ప్రస్తుత కాలంలో మన సంప్రదాయాలు కనుమరుగౌతున్న తరుణంలో మాన వతా స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యం లో సాప్రదాయాలను గుర్తు చేస్తూ కార్యక్రమం నిర్వహిం చడం శుభపరిణామమన్నారు. ఆట, పాటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాన వత సభ్యులు సామంతపూడి నాగేశ్వరరావు, శ్రీని వాసరావు, కల్లం సుబ్బారెడ్డి, యల మందారెడ్డి, శ్రావణి, తానికొండ వెంకట్రావు, మేడా నరసింహారావు తది తరులు పాల్గొన్నారు.

పోలీసు స్టేషన్‌కు సంక్రాంతి శోభ

మార్కాపురం : స్థానిక పోలీసు స్టేషన్‌లు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. భోగి, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మార్కాపురం టౌన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్‌లకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు, హోగార్డు సిబ్బంది రెండు స్టేషన్‌ల ముందు సాంప్రదాయబద్దంగా కల్లాపి చల్చారు. సంక్రాంతిని ఆహ్వానిసూ పలు రకాల రంగులతోరంగవళ్లులను కళాత్మకంగా తీర్చిదిద్దారు.

గిద్దలూరు : పట్టణంలోని కుసుమ హరనాథ మందిరం ఆవరణలో నియోజకవర్గ దేవాలయాల కమిటీ, విశ్వహిందూ పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి 4 బహుమతులతోపాటు పది మంది కన్సోలేషన్‌ బహు మతులు విజేతలకు అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందజేశారు. ప్రథమ విజే తగా బెల్లం హిమబిందు, ద్వితీయ బహుమతి దుద్యాల వందన, తృతీయ బహుమతి తూర్పునాటి నరసమ్మ, నాల్గవ బహుమతి గాదంశెట్టి అంకితసాయి దక్కించు కున్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు చేరెడ్డి యర్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ దప్పిలి విజయ భాస్కర్‌రెడ్డి, వేంకటేశ్వరస్వామి దేవస్థాన అధ్యక్షులు వీరయ్య, వివిధ వర్గాల ప్రతినిధులు కిరణ్‌, బాలు, నాగేశ్వరరావు, నరసింహరావు, దాతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:49 AM