విద్య, వైద్యానికి ప్రాధాన్యం

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:33 PM

కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్‌ పేర్కొన్నారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు పత్రాలను అందిస్తున్న టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్‌

టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్‌ మహేంద్రనాథ్‌

చీరాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డా.మహేంద్రనాథ్‌ పేర్కొన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలు నిమిత్తం వైద్యం పొందిన 36 మందికి ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.42లక్షలు విలువగల సిఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు పత్రాలను బుధవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు కూడా కార్పోరేట్‌ స్థాయి వైద్యం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మహేంధ్రనాధ్‌ తెలిపారు. ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:33 PM