ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాసుపుస్తకాలకు రూ.4వేలు వసూలు

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:50 PM

పట్టాదారు పాసుపుస్తకాల కోసం గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు రూ.4 వేల తీసుకున్నారని రైతు ప్రేమచంద్రరావుతో పాటు పలువురు రైతులు మం త్రి రవికుమార్‌ దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి స్పందించిన మంత్రి రవికుమార్‌ రైతులు తగు ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకునే వీలు ఉంటుందన్నారు. గోవాడలో శనివారం పలు గ్రా మాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి రవికుమార్‌ దృష్టికి తీ సుకు వచ్చారు.

మంత్రి రవికుమార్‌కు ఫిర్యాదు చేస్తున్న రైతులు

రెవెన్యూ అధికారులపై మంత్రికి రైతుల ఫిర్యాదు

భూ సమస్యలపై నిర్లక్ష్యం వద్దు : గొట్టిపాటి

అద్దంకి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పట్టాదారు పాసుపుస్తకాల కోసం గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు రూ.4 వేల తీసుకున్నారని రైతు ప్రేమచంద్రరావుతో పాటు పలువురు రైతులు మం త్రి రవికుమార్‌ దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి స్పందించిన మంత్రి రవికుమార్‌ రైతులు తగు ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకునే వీలు ఉంటుందన్నారు. గోవాడలో శనివారం పలు గ్రా మాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి రవికుమార్‌ దృష్టికి తీ సుకు వచ్చారు. అనంతరం రవికుమార్‌ మాట్లాడుతూ భూసమస్యలు చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే జఠిలమై జీవితాంతం పరిష్కారం కాకుండా మిగిలిపోయే అవకాశం ఉందన్నారు. మైలవరం చెరువు మధ్యలో పట్టా భూమి ఉందని కొంత మంది గత ప్రభుత్వంలో రైతుల పై కేసులు నమోదు చేశారని తక్షణమే పరిష్కరించాలన్నారు. విద్యుత్‌ హెల్పర్‌ లేక 7 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీ సుకు రావడంతో నియోజకవర్గంలో ఉన్న విద్యుత్‌ సిబ్బందిని సర్దుబాటు చేసి ఎలాంటి విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే వ్యవసాయ కనెక్షన్‌లను మంజూరు చేయాలన్నారు. పూర్తిగా శిథిలమైన గోవాడ, మైలవరం తారు రోడ్లు త్వరలో పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఫింఛన్‌ల పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే తొలగించాలని, అర్హుల నుంచి కొత్త ఫింఛన్‌లకు దరఖాస్తులు తీసుకోవాలని, ప్రభుత్వం త్వరలో మం జూరు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సగం బడ్జెట్‌ పింఛన్‌లకు ఖర్చు అవుతుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న చుక్కల భూముల జాబితా సిద్ధం చేసి పరిశీలన చేయాలన్నారు. 2014-19 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణం చేసుకొని బిల్లులు జమ కాకపోతే ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరుపయోగంగా మారిన ధర్మవరం మంచి నీటి పథకం స్థితి గతులను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. గతంలో ఉన్న అద్దంకి క్లష్టర్‌ను మరలా ఏర్పాటు చేయాలని డ్వామా అధికారులను మంత్రి ఆదేశించారు. కార్య క్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ప్రకర్‌జైన్‌తో పాటు స్థానిక అధికారులు, టీడీపీ నేతలు నాగినేని రామకృష్ణ, మానం మురళీమోహన్‌దా్‌స, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దివకోలు రాధాకృష్ణ, స్వయంపు సురేష్‌, బైరపునేని సత్యనారాయణ, పుట్టా సాంబశివరావు, మాకినేని ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:50 PM