ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచ ఖోఖో పోటీలకు శివారెడ్డి

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:53 PM

పంగులూరుకు చెందిన పి.శివారెడ్డి భారత ఖోఖో జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 19 వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న ప్రపంచ ఖోఖో పోటీలలో పాల్గొనే భారత పురుషుల జట్టులో శివారెడ్డి ఆడనున్నారు. శివారెడ్డి పంగులూరులోని ఎస్‌ఆర్‌ఆర్‌ ఖోఖో అకాడమీలో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు.

పంగులూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : పంగులూరుకు చెందిన పి.శివారెడ్డి భారత ఖోఖో జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 19 వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న ప్రపంచ ఖోఖో పోటీలలో పాల్గొనే భారత పురుషుల జట్టులో శివారెడ్డి ఆడనున్నారు. శివారెడ్డి పంగులూరులోని ఎస్‌ఆర్‌ఆర్‌ ఖోఖో అకాడమీలో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. గతంలో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ ఖోఖో పోటీలలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఖోఖోలో అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న శివారెడ్డి భారత తపాలశాఖలో క్రీడల కోటాలో ఉద్యోగం పొందారు. మన రాష్ట్రం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా పంగులూరుకు చెందిన శివారెడ్డి భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల ఖోఖో అసోషియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ గరటయ్య, కార్యదర్శి సీతారామిరెడ్డి, ఆంధ్రా అసోషియేషన్‌ అధ్యక్షుడు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, జిల్లా అసోషియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు కుర్రా భాస్కరరావు, కాశీ విశ్వనాథరెడ్డి అభినందించారు.

Updated Date - Jan 09 , 2025 | 11:53 PM