నాయుడుపల్లె కాలనీలో మంచినీటికి కటకట
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:56 AM
తర్లుపాడులోని నాయుడుపల్లికాలనీ రైల్వేగేట్ వద్ద నున్న బీసీ కాలనీ వాసులు వారం రోజులుగా మంచినీటికి కటకటలాడుతున్నారు.

తర్లుపాడు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడులోని నాయుడుపల్లికాలనీ రైల్వేగేట్ వద్ద నున్న బీసీ కాలనీ వాసులు వారం రోజులుగా మంచినీటికి కటకటలాడుతున్నారు. ఈ కాలనీలకు నీటి సరఫరా చేసే బోరు మర మ్మతులకు గురికావడంతో మంచినీటి ఎద్దడి ఏర్పడింది. బోరుకు మరమ్మతు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారు లకు బోరు బాగుచేయించాలని విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో వీరికి నీటి కష్టాలు తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో తర్లు పాడు బస్టాండ్ కూడలిలోని చిన్న ట్యాంకు నుంచి తోపుడు బండ్ల ద్వారా బైకులు, సైకిళ్లు, ఆటోలలో నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ కాలనీవాసులు రెక్కా ఆడితే డొక్కా ఆడని పరిస్థితి. నీటి ఎద్దడి ఏర్పడంతో ఇంటిలోని ఒకరు కూలి పనులు మానుకొని నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు బోర్లు మరమ్మతులకు గురైనప్పుడు కూడా రోడ్డెక్కి ధర్నా చేయాల్సి వచ్చిందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు లేనిపక్షంలో కాలనీ సమస్యను అధికారులు పట్టించు కోరని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డీప్ బోరుకు మరమ్మతులు చేయించి నీటిఎద్దడి తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:56 AM