ఫార్మర్ రిజిస్ర్టీతో రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:30 PM
మండలంలోని కొమ్మునూరు, తాళ్ళపల్లి గ్రామాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం గురించి రైతులకు వివరించారు. దీని ద్వారా ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని పేర్కొన్నారు. భూమి గల రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీ, వ్యవసాయ ఆధారిత వృత్తులపై జీవించే వారు అర్హులని పేర్కొన్నారు.
గిద్దలూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమ్మునూరు, తాళ్ళపల్లి గ్రామాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ర్టీ కార్యక్రమం గురించి రైతులకు వివరించారు. దీని ద్వారా ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని పేర్కొన్నారు. భూమి గల రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీ, వ్యవసాయ ఆధారిత వృత్తులపై జీవించే వారు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల రాయితీలు, భూ ఆధారిత చెల్లింపులు, పంటల బీమా, పంట నష్టపరిహారం, వడ్డీ రాయితీ, వ్యవసాయ పనిముట్లు, ఫార్మర్ రిజిస్ట్రి నెంబరు ఉన్న వారు పొందవచ్చని పేర్కొన్నారు. గ్రామసభల అనంతరం కంది, శనగ పంటలను నేరుగా పరిశీలించి చీడపీడలు, నివారణ చర్యల గురించి రైతులకు వివరించారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ సహాయకులు యూసఫ్, మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు.
కొమరోలులో..
కొమరోలు : భూమి కలిగిన ప్రతి రైతు తమ వివరాలతో ఫార్మర్ రిజిస్ర్టీ చేసుకుని ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాలని మం డల వ్యవసాయాధికారి రాజశ్రీ తెలిపారు. మండలంలోని అల్లీనగరం, గోనెపల్లి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. మండలంలోని అన్ని రైతు సేవాకేంద్రాల్లో ఈ ఐడీ నెంబరు నమోదు చేసుకోవచ్చునన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కే శీరిష, గ్రామ సహాయకులు రమణమ్మ, లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 11:30 PM