ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:58 PM

యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ఆయ న బోధనల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కొత్తపట్నం బస్టాండులోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

హ్యాండిక్రాఫ్ట్‌లో ప్రతిభ చూపిన లలితాంబికకు ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న మంత్రి స్వామి

మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ఆయ న బోధనల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కొత్తపట్నం బస్టాండులోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. అందుకోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబ ఇటీవల ప్రకటించిన విజన్‌ డాక్యుమెంట్‌లో కూడా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, ప్రతి ఇంటి నుంచి ఒకపారిశ్రామిక వేత్త తయారయ్యేలా ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, నెహ్రూ యువకేంద్రం అధికారి కమల్‌షా, స్టెప్‌ సీఈవో శ్రీమన్నారాయణ, బీజేపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్జి యోగయ్యయాదవ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా స్థాయి యువజనోత్సవంలో పాల్గొని ప్రతిభ చూపిన వారికి మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు.

వివేకానందుని మాటలు స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే కొండయ్య

చీరాల : సమాజ జాగృతికి, ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు శ్రమ నీ ఆయుధం అయితే ... విజయం నీ బానిస అవుతుంది లాంటి స్వామీ వివేకానంద మాటలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం ఆర్డీవో కార్యాలయం సమీపంలోని వివేకానందుని విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యునిగా వివేకానంద వేసిన అడుగులు, చేసిన ఉపన్యాసాలు అనుక్షణం సమాజ హితాన్నే కోరాయన్నారు. కార్యక్రమంలో వివేకా నం సేవా సమితి అధ్యక్షుడు సర్విశెట్టి సుబ్బరామయ్య, పలువురు రొటేరియన్లు, టీడీపీ, జనసేన, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పలు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

Updated Date - Jan 12 , 2025 | 11:58 PM