పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:46 AM
పాడిరైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
గిద్దలూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పాడిరైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిగోకులాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దే శించి అశోక్‌రెడ్డి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాడిరైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందన్నారు. పశు సంవర్ధకశాఖ అధికారులు, ఉపాధిహామీ అధికారులు సమన్వయంతో పనిచేసి మంజూరైన మినీ గోకులాలను త్వరితగతిన ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావా లని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్‌ఖాశింభీ, సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, టీడీపీ మండలశాఖ అధ్యక్షులు కటికే యోగానంద్, నాయకులు జీవన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటరామిరెడ్డి, వ్యవసాయశాఖ ఏడీఏ బాలాజీ నాయక్, ఏపీవో మోషె, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దారవీడు : పశుపోషణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని తోకపల్లిలో రూ.2.30లక్షలతో ప్రభుత్వ సహకారంతో నిర్మించిన మినీగోకులం షెడ్డును శనివారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఉపాధికి ఒక వైపు ప్రాధాన్యత ఇస్తూనే గ్రామీణ ప్రాంతాలలో మొరుగైన ఉత్పాదకను పెంపొందించేందుకు తోడ్పాటు నందిస్తుంద న్నారు. కుల, మత, రాజకీయ, వర్గ విబేధా లకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ, పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాన్ సుందరం, టీడీపీ మండలా ధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీలు గుమ్మా గంగరాజు, జడ్డా రవి, మాజీ సర్పంచ్ నరాలు శ్రీనివాసులు, సుబ్బరామిరెడ్డి, ఇండ్లా రామకృష్ణారెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, దుగ్గెంపూడి కొండారెడ్డి, నక్కా శ్రీను, మూడమంచు కొండగురవయ్య, , ఈసీ నాయక్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : పేద రైతుల కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గోకులం షెడ్‌లు పేద రైతులకు వరమని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని మేడపి గ్రామంలో ఉపాదిహామీ పథకం ద్వారా 90 శాతం రాయితీతో రూ.2.3 లక్షల నిధులతో నిర్మించిన గోకులం షెడ్డును మండల అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎరిక్షన్‌బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మరిన్ని గోకులం షెడ్లను రైతులకోసం మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్‌కుమార్, ఈవోపీఆర్‌డీ రామసుబ్బయ్య, ఏపీవో సుజాత, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో నిర్మించిన మిని గోకులం షెడ్డును టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు శనివారం ప్రారంభించారు. గోకులం షెడ్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్కో షెడ్డు రూ. 2.30లక్షలతో నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, ఏపీవో ఎం.శైలజ, ఐటీడీఏ ఏపీవో కె.నాగేశ్వరరావు, మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, కాశికుంట తాండ సర్పంచ్ ఎంసీ.హెచ్ మంత్రునాయక్, నాయకులు కంచర్ల సత్యనారాయణ గౌడ్, వెంకటరెడ్డి, మహేష్‌నాయుడు, కొత్తమాసు అనంత వెంకట సుబ్రహ్మణ్యం పసుపులేటి వెంకట నారాయణ, మేకల శ్రీను, పాలడుగు వెంకట కోటయ్య ఉపాధి హామీ ఈసీ లక్ష్మనాయక్, టీఏ గౌసియా బేగం సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 01:46 AM