నిధుల దుర్వినియోగంపై విచారణ పూర్తయ్యేనా!

ABN, Publish Date - Apr 06 , 2025 | 10:43 PM

దొనకొండ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ ఎప్పటికీ పూర్తవుతుందోనని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల స్వాహాపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులుచేశారు. వారి ఆదేశాల మేరకు ఇటీవల కనిగిరి డివిజన్‌ డీఎల్‌పీవో హనుమంత రావు, జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు దొనకొండ పంచాయతీ కార్యాలయానికి వచ్చి విచారించారు.

నిధుల దుర్వినియోగంపై విచారణ పూర్తయ్యేనా!

దొనకొండ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): దొనకొండ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ ఎప్పటికీ పూర్తవుతుందోనని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల స్వాహాపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులుచేశారు. వారి ఆదేశాల మేరకు ఇటీవల కనిగిరి డివిజన్‌ డీఎల్‌పీవో హనుమంత రావు, జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు దొనకొండ పంచాయతీ కార్యాలయానికి వచ్చి విచారించారు. గత ఏడాది మార్చి నుంచి అక్టోబరు వరకు అదనపు బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నులకు సంబంధించిన దాదాపు రూ.8 లక్షల వివరాలు తెలపలేదు. అప్ప టి రికార్డులను ఐదు నెలల క్రితం గ్రామ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తికి నేటికీ అప్పగించలేదు. దీంతో డీపీవో, డీఎల్‌పీవోలు సదరు కార్యదర్శిని ప్రశ్నించి అప్పటి రికార్డులు, ఇంటి పన్నుల నగదు లెక్కల వివ రాలను త్వరలో అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం. సంబంధిత అధికారులు దొనకొండ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం ఎంత జరిగిందో సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై డీఎల్‌పీవో హనుమంతరావును వివరణ కోరగా దొనకొండ పం చాయతీలో నిధుల దుర్వినియోగంపై ఒక విడత వచ్చి పరిశీలించామన్నారు. ఇతర పనుల కారణంగా పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్నారు. ఈనెల 10వ తేదీన దొనకొండలో ఉండి విచారణ చేపడతామని తెలిపారు.

Updated Date - Apr 06 , 2025 | 10:43 PM