మహిళా ఉద్యోగులు సమస్యల పరిష్కారంపై దృష్టి
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:28 PM
ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహిళా వింగ్ పని చేస్తుందని ఏపీఎన్‌జీవో మహిళా వింగ్‌రాష్ట్ర చైర్‌పర్సన్ నిర్మలాకుమారి పేర్కొన్నారు.
ఏపీఎన్‌జీవో మహిళా వింగ్
రాష్ట్ర చైర్‌పర్సన్ నిర్మలాకుమారి
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహిళా వింగ్ పని చేస్తుందని ఏపీఎన్‌జీవో మహిళా వింగ్‌రాష్ట్ర చైర్‌పర్సన్ నిర్మలాకుమారి పేర్కొన్నారు. స్థానిక ఎన్‌జీవ భవన్‌లో గురువారం మహిళా వింగ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి జిల్లా చైర్‌పర్సన్ కోటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పనిప్రదేశంలో జరుగుతున్న వేధింపులు, రెస్ట్‌రూమ్స్ లేకపోవడం వంటి సమస్యలపై చర్చించారు. ఆయా శాఖల్లో మహిళా ఉద్యోగుల సమస్యలపై నివేదికలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పి.మాధవి, ఆల్ ఇండియా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమెన్ కన్వీనర్ ఎన్.రాజ్యలక్ష్మి, ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్‌బాబు, కార్యదర్శి ఆర్‌సీహెచ్.కృష్ణారెడ్డి, జిల్లా మహిళా వింగ్ కన్వీనర్ సీహెచ్.శిరీష, నారాయణమ్మ, రత్నరాణి, శివకుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 11:28 PM