వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ABN, Publish Date - Jan 12 , 2025 | 11:44 PM
వివేకానందుడి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేయాలని శ్రీమత్‌స్వామి సన్నివాసనంద్ జీ మహరాజ్ అన్నారు. వివేకానంద జయంతి సంద ర్భంగా స్థానిక పొదిలి రోడ్డులోని దేవాంగనగర్ వద్ద ఉన్న రామకృష్ణ ద్యానమందిరంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్వామి సన్నివాసానంద్‌జీ మహరాజ్
కనగిరి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): వివేకానందుడి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేయాలని శ్రీమత్‌స్వామి సన్నివాసనంద్ జీ మహరాజ్ అన్నారు. వివేకానంద జయంతి సంద ర్భంగా స్థానిక పొదిలి రోడ్డులోని దేవాంగనగర్ వద్ద ఉన్న రామకృష్ణ ద్యానమందిరంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతలో వ్యక్తిగతంగా తమలో ఉన్న ప్రతిభను గుర్తించుకోలేక చెడుమార్గాల అన్వేషణలో కొట్టు మిట్టాడుతున్నార న్నారు. చెడు మార్గాల ద్వారా సమజానికి చేటుగా మా రి అటు తల్లితండ్రులకు మానసిక క్షోభను మిగుల్చుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మనిషిలో మం చి, చెడులు ఉంటాయన్నారు. కుళ్ళిపోయిన ఆహారాన్ని ఏవిధంగా త్యజిస్తామో, అదేవిధంగా ప్రతి మనిషిలోని చెడు భావనలు విడనాడి మంచి మార్గంలో నడిచేందు కు కంకణబద్ధులు కావాలన్నారు. తద్వారా సమాజానికి, తల్లితండ్రులకు మంచిపేరు తెచ్చినవారవుతారన్నారు.
వివేకానందుడు సమాజ హితం కోసం, మతసామ రస్యం, యువకులు దాగిఉన్న ప్రతిభను గుర్తించి వారిని ఆదిశగా ప్రోత్సహించేవారని స్వామీజి పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ వివేకానందుడి మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా వివేకానందుడి జీవిత చరిత్రపై నియోజకవర్గంలోని వివిద పాఠశాలలకు చెం దిన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు స్వామీజి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రామ కృష్ణ మందిరం కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పామూరులో..
పామూరు, జనవరి 12 (ఆంధ్ర జ్యోతి): భారత జాతిని మేల్కొలి పిన వైతాళికులు హైందవ ధర్మ ఔనత్వాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుని బాటలో యువత ముందుకుసాగాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కేవీ రమణయ్య అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యా లయంలో వివేకానంద స్వామి జయంతి, జాతీయ యువజన దినోత్సవం ఆపార్టీ మండల అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భం గా వివేకానందుని విగ్రహానికి రమణ య్య పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో పి.విజయకుమార్‌చారి, సీహెచ్ మల్లికార్జున, బి.హజరత్‌కుమార్, డి .పవన్, పాడే అరవింద్, ఎస్.శివకృష్ణ, డి.చరణ్, పాతపాటి పవన్, నా గేంద్ర పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 11:44 PM