ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Epilepsy Treatment : రాష్ట్రంలో తొలిసారిగా మూర్ఛకు శస్త్రచికిత్స

ABN, Publish Date - Jan 12 , 2025 | 06:44 AM

నెల్లూరులోని నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా మూర్ఛవ్యాధికి వీగల్‌నర్వ్‌ స్టిములైజేషన్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. శనివారం నగర శివార్లలోని

నారాయణ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహణ.. ప్రతి నెలా నాలుగో గురువారం ఉచిత సేవలు

నెల్లూరు(వైద్యం), జనవరి 11(ఆంధ్రజ్యో తి): నెల్లూరులోని నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా మూర్ఛవ్యాధికి వీగల్‌నర్వ్‌ స్టిములైజేషన్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు వైద్య నిపుణులు వెల్లడించారు. శనివారం నగర శివార్లలోని నారాయణ ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, న్యూరోసర్జన్‌ డాక్టర్‌ సాయికిరణ్‌ మాట్లాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన సాయిపల్లవి(16) పుట్టుకతోనే మూర్ఛవ్యాధితో బాధపడుతూ, 12 ఏళ్లుగా వివిధ ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేక నారాయణ ఆసుపత్రిని సంప్రదించారని చెప్పారు. ఆమె వ్యాధిని రీప్లక్స్‌ ఎపిలెప్సీగా నిర్ధారించామన్నారు. ఈ నేపఽథ్యంలో సత్వర ఉపశమనం కోసం వీగల్‌నర్వ్‌ స్టిమిలైజేషన్‌ అనే ఆధునిక విధానం ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించామని తెలిపారు. ఈ చికిత్స రాష్ట్రంలోనే మొదటిదని వెల్లడించారు. ఆసుపత్రి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ మెట్రో నగరాల్లో రూ.లక్షలు ఖర్చయ్యే ఈ వ్యాధికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. నారాయణ ఆసుపత్రిలో ప్రతి నెలా నాలుగోగురువారం ఉచిత వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరింత సమాచారం కోసం 96401 00555 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో న్యూరో అనస్ధలిస్ట్‌ డాక్టర్‌ అనిల్‌, ఏజీఎం శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 06:45 AM