ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయింపు: మంత్రి

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:02 AM

సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన రహదారులకు రూ.600 కోట్లు కేటాయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు.

టీడీపీ సభ్యత్వ కార్డులను అందజేస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన రహదారులకు రూ.600 కోట్లు కేటాయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి కార్యాలయంలో బీసీ జనార్దనరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన రహదారులు, రాష్ట్ర ప్రధాన హైవేలల పథకం కింద రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.861 కోట్లతో సుమారు 20వేల కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 64 నియోజకవర్గాల్లో 86 పనులు చేపట్టి రూ.200 కోట్లతో 536 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో హైవేలకు సంబంధించి 99 నియోజకవర్గాల్లో 139 పనులు చేపట్టి రూ.400 కోట్ల వ్యయంతో 896.41 కిలోమీటర్ల మేర రోడ్లును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మొత్తంగా 225 పనులకు రూ.600 కోట్లతో 1432.41 కిలో మీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రోడ్లకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

టీడీపీ సభ్యత్వ కార్డుల పంపిణీ

పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో టీడీపీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బీసీ జనార్దనరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా టీడీపీ కార్యకర్తలు 63 వేల వరకు రికార్డు స్థాయిలో సభ్యత్వం చేశారన్నారు. మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ కోటిమంది సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత టీడీపీ యువ నాయకుడు లోకేశకే దక్కుతుందని అన్నారు. టీడీపీ నాయకులు అంబాల రామకృష్ణారెడ్డి, మూలే రామేశ్వరరెడ్డి, పెండేకంటి కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:02 AM