ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రారండోయ్‌.. పండుగ చేద్దాం

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:20 AM

గడచిన ఐదేళ్లతో పోలిస్తే ఈసారి పల్లె, పట్నం తేడా లేకుండా పండుగ వాతా వరణం అలముకుంది. గతంలో రాజ కీయం వేడెక్కి ఉండడం, ప్రతీది వివాదాస్పదం కావడం, సామాజిక వర్గాల వారీగా టార్గెట్‌లు పెట్టుకుని ఏదో రూపంలో అడ్డగించేవారు. ఆఖరుకి ఊళ్ళల్లో పందెం కోళ్ళ బరులు వేయా లన్నా ఏకపక్షమే. కూటమి ప్రభుత్వం రాకతో స్వేచ్ఛ లభించినట్టు అన్ని వర్గాలు పండుగ సంబ రాలకు సంసిద్ధమయ్యాయి.

కలపర్రు టోల్‌గేట్‌ వద్ద రద్దీ

పందెం కోళ్ల బరుల కోసం పోటాపోటీ

స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిళ్లు

న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ వాదిస్తున్నా ఎగబడుతున్న కేడర్‌

అన్నిచోట్ల కూటమి నేతలతో జోష్‌

గత ఐదేళ్లకు భిన్నంగా ఈసారి పండుగ

వరుస సెలవులతో ఇక సందడే..

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

గడచిన ఐదేళ్లతో పోలిస్తే ఈసారి పల్లె, పట్నం తేడా లేకుండా పండుగ వాతా వరణం అలముకుంది. గతంలో రాజ కీయం వేడెక్కి ఉండడం, ప్రతీది వివాదాస్పదం కావడం, సామాజిక వర్గాల వారీగా టార్గెట్‌లు పెట్టుకుని ఏదో రూపంలో అడ్డగించేవారు. ఆఖరుకి ఊళ్ళల్లో పందెం కోళ్ళ బరులు వేయా లన్నా ఏకపక్షమే. కూటమి ప్రభుత్వం రాకతో స్వేచ్ఛ లభించినట్టు అన్ని వర్గాలు పండుగ సంబ రాలకు సంసిద్ధమయ్యాయి. వరుస సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, మహరాష్ట్ర తదితర ప్రాంతాలతోపాటు విదేశాల్లో ఉన్న వారు సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

వాస్తవానికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక్క మూడు రోజులే కాదు.. అటు పది రోజులు, ఇటు పది రోజులు ఆ జోష్‌ కొనసాగిస్తారు. అన్ని పనులను పక్కనపెట్టేస్తారు. మహిళలంతా ముగ్గులు, వంటల్లో నిమగ్నమైతే మగవారంతా పెద్ద పండుగ కదా అంటూ తెగ సంబరాలు చేసుకుంటారు. ప్రత్యేకించి కోడి పందేలు కోసం వేలాది మంది ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. కోడి పందేలు.. జూదం వద్దని, సంప్రదాయ పండుగే ముఖ్యమని ప్రభుత్వం ఒకవైపు, న్యాయ స్థానాలు ఇంకోవైపు చైతన్యపరుస్తున్నా పాత వాసన లు వదులుకోవడానికి ఏ ఒక్కరూ సిద్ధపడడంలేదు. వారం రోజులుగా జిల్లా స్థాయిలో అటు పోలీస్‌, ఇటు రెవెన్యూ అధికారులు పనిగట్టుకుని

కోడి పందేలు వద్దేవద్దంటూ శతవిధాలా ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

బరుల కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావడంతో కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల జోష్‌ అంతా ఇంతా కాదు. గత ఐదేళ్ల పాటు కనీసం సంక్రాంతి పండుగ నాడైనా పందెం వేయ నీయకుండా వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఈసారి దీనికి అంతకంతకు బదులు తీర్చుకుంటామన్న ధోరణిలోనే వీరంతా ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేల వద్ద మూడు పక్షాలకు చెందిన కార్యకర్తలు కోడి పందేల బరులు తామే నడుపుకుంటామని ప్రత్యక్షంగా పోటీలు పడుతు న్నారు. గతంలో జంగారెడ్డిగూడెం, పోలవరం, చింతల పూడి, ఏలూరు, దెందులూరు వంటి ప్రాంతాల్లో ఏకపక్షంగా కోడి పందేలు సాగేవి. ముందస్తుగా పోలీసులు అప్పుడు, ఇప్పుడు పందెం బరులను ధ్వంసం చేస్తూనే ఉన్నా పండుగ మూడు రోజులు జనం ఆనందం కట్టలు తెంచుకుంటూనే ఉంది. ఆదివారం నుంచి ముక్కనుమ వరకు పోలీసులెవరూ తమవైపు చూడకుండా మీరే అడ్డుగా నిలవాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా తలలు పట్టుకుంటు న్నారు. నూజివీడు, కైకలూరులో భారీ ఎత్తున పందేలు వేసుకోవడానికి నేతలే పోటీలు పడుతున్నారు. ‘గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులంతా రెండో కంటికి తెలియకుండా నాలుగు రోజులపాటు పందేలు వేసి ఖర్చులు సమకూర్చుకున్నారు. కూటమి ఇప్పుడు అధికారం లోకి వచ్చినా ఇంకా మీనమేషాలేమిటి’ అంటూ కార్యకర్తలు కామెంట్లు చేయడం సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది.

కుదరదంటూనే..

యథావిధిగా నిబంధనల పేరిట కుదరదంటూనే సంప్రదా య పందేలకు అడ్డులేదంటూ చివరి నాలుగు రోజులు పందే లకు గేట్లు తెరిచే ఆనవాయితీ ఈసారీ కొనసాగబోతుంది. ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కార్యకర్తలు తీసుకొస్తున్న ఒత్తిడిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ధ్వంసం చేస్తున్నా కొత్త బరులకు అంతా రంగం సిద్ధమైంది. గతేడాది కోడి పందేల్లో దాదాపు రూ.46 కోట్ల మేర పందేల జోరు నడిచిందని అంచనా.

చెరువుగట్లే ..ఆతిథ్యం

పట్టణ, నగర ప్రాంతాల్లో సేద తీరడానికి

ఆస్కారం లేని అతిథులు తమ గ్రామానికి వస్తే వారిలో కొత్త జోష్‌ నింపే ప్రయత్నం జరుగుతోంది. తోటల్లో, చెరువుగట్ల మీద, పంట చేల నడుమ విందు, వినోదాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఊళ్ళకు చేరుకున్న వారంతా సండే స్పెషల్‌’కు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే అనేక పల్లెల్లో కొబ్బరితోటలు, పామాయిల్‌ తోటలకు సరుకు చేరింది. ఆ మేరకు ఆటపాటకు సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్ళు పచ్చదనం లేకుండా కేవలం కాంక్రీట్‌ జంగిల్‌లోనే గడిపిన వారందరికీ కొత్త టేస్ట్‌ తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్‌హౌస్‌ల నుంచి ఇప్పటి నుంచే తగిన సామగ్రి తోటల్లోకి, చెరువు గట్ల మీదకు చేరింది. పెద్ద పండుగకు పెద్ద ఏర్పాట్లు పేరిట కొందరు బడా నేతలు సిద్ధపడుతున్నారు.

మద్యం అమ్మకాలు రెట్టింపు

మద్యం షాపుల్లో గడిచిన రెండు రోజులుగా అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. రాబోయే ఐదు రోజులు మరింత జోరందుకోను న్నాయి. ఇంతకుముందైతే తెలంగాణ ప్రాంతం నుంచి తక్కువ ధరకు మద్యం తమ వెంటే తెచ్చుకుని ఇక్కడకు వచ్చేవారు. కాని ఇప్పుడా పరిస్థితి తొలగి మద్యం ధరలు ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి.

కలపర్రు టోల్‌గేట్‌ వద్ద రద్దీ

పెదపాడు, : సంక్రాంతి పండుగ వేళ స్వగ్రామాలకు, బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చేవారి వాహనాలతో జాతీయ రహదారితో పాటుగా గ్రామాలకు దారితీసే రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. శనివారం ఉద యం నుంచే రోడ్లపైకి వాహనాల రాకపోకలు పెరగడంతో పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్‌ వద్ద కొన్ని గంటల సేపు వాహనాలు బారులుదీరి కన్పించాయి. బెంగళూరు, హైదరా బాద్‌తో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వాహనాలు ఏలూరు వైపుగా జాతీయ రహదారిపై ముందుకు కదిలాయి. టోల్‌గేట్‌ వద్ద మధ్యాహ్నం వరకు కన్పించిన రద్దీ సాయంత్రానికి కాస్తా మందగించింది.

Updated Date - Jan 12 , 2025 | 12:20 AM