Share News

Andhra Pradesh weather: ఎండ ప్రచండం!

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:06 AM

ఉత్తరకోస్తాలో తీవ్ర వడగాడ్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోస్తా, రాయలసీమల్లో 40°C దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు కొనసాగుతుండగా, రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.c

Andhra Pradesh weather: ఎండ ప్రచండం!

అట్లూరు, రుద్రవరం, పెద్దారవీడులో 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు

అమరావతి, విశాఖపట్నం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వడగాడ్పులతో ఉత్తరకోస్తా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. శనివారం కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో కూడా అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల 40 డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 27 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయగా, 103 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. 22 జిల్లాల్లోని 232 ప్రాంతాల్లో 40డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, 96 ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా కడప జిల్లా అట్లూరులో 43.7, నంద్యాల జిల్లా రుద్రవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 43.5, అన్నమయ్య జిల్లా వతలూరులో 42.7, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.4, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.2, విజయనగరం జిల్లా గుర్లలో 42.1, తిరుపతి జిల్లా గూడూరులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం అల్లూరు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు 126 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా, శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల మేఘాలు ఆవరించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి, రెండుచోట్ల వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని, అక్కడక్కడా వాతావరణ అనిశ్చితి కారణంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:06 AM