భూ సమస్యలను పరిష్కరించండి
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:07 AM
మండలంలోని పలు గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇప్పటివరకు 250 ఫిర్యాదులు అందాయని, ఎక్కువగా సాగు భూముల పట్టాల సమస్యలే ఉన్నాయని తహసీల్దార్ దేవేంద్రనాయక్ అన్నారు.
నంబులపూలకుంట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇప్పటివరకు 250 ఫిర్యాదులు అందాయని, ఎక్కువగా సాగు భూముల పట్టాల సమస్యలే ఉన్నాయని తహసీల్దార్ దేవేంద్రనాయక్ అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వ యంతో వాటిని పరిష్కరించడానికి చొరవ చూపాలని ఆయన సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ రాము అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఇనచార్జీ ఎంపీడీఓ ఆంజనప్ప అజెండాను చదివి వినిపించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. ఈనెలలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఎదురుదొనలో రీసర్వే నిర్వహిస్తామని, ముందుగా ప్రభుత్వం భూములను సర్వే చేస్తామని అన్నారు. పశువైద్యాధికారి బాలనాయక్ మాట్లాడుతూ.. తమ సిబ్బంది సచివాలయ పనులకు, సర్వేలకు వెళ్లడంతో తమ పనులు జరగడంలేదని వాపోయారు. ఏపీఎం వెంకటనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ. పది లక్షల వరకు వడ్డీలేని సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్‌నాయక్, ఏఓ లోకేశ్వర్‌రెడ్డి, వైద్యాధికారి ఆనంద్‌వర్ధన, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 12:07 AM