Share News

Sugali Rama death: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్‌ మృతి

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:04 AM

అన్నమయ్య జిల్లా సంబేపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుగాలి రమ మృతిచెందారు. చెన్నైకి వెళుతున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Sugali Rama death: రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్‌ మృతి

అన్నమయ్య జిల్లా సంబేపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. అతివేగమే కారణమంటున్న పోలీసులు

సంబేపల్లె, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా సంబేపల్లె వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుగాలి రమ (56) మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. సుగాలి రమ అన్నమయ్య జిల్లా పీలేరులో హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. రాయచోటిలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె కారులో బయలుదేరారు. ఎర్రగుంట్ల బస్టాప్‌ సమీపంలోకి రాగానే రాయచోటి నుంచి చెన్నై వెళుతున్న కారు.. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్‌ ముబారక్‌, అటెండర్‌ జీరూనాయక్‌ మరో కారు డ్రైవర్‌ మణికంఠ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌వో, ఆర్డీవో, రూరల్‌ సీఐ, ట్రాఫిక్‌ సీఐ, తహశీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రితో రమ మృతదేహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నివాళులు అర్పించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా.. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఆమె భర్త రాజేంద్రనాయక్‌ ఎస్‌ఐగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.


ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 08 , 2025 | 05:04 AM