Share News

Intermediate Results : పెద్ద చదువులకు గిరాకీ!

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:22 AM

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో 45 వేల మంది ఎక్కువగా పాస్‌ కావడంతో రాష్ట్రంలో ఉన్నత విద్యలో అడ్మిషన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ వర్సెస్‌ బీసీఏ కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

Intermediate Results : పెద్ద చదువులకు గిరాకీ!

ఇంటర్‌లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత

2024లో 3.06 లక్షల మంది పాస్‌ కాగా.. ఈ ఏడాది 3.51 లక్షల మంది

పెరిగిన ఉత్తీర్ణులు 44,993 మంది

ఇంజనీరింగ్‌, డిగ్రీ కోర్సులకు డిమాండ్‌

ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగే అవకాశం

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నత విద్యకు డిమాండ్‌ పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరగడమే ఇందుకు కారణం. సెకండియర్‌ విద్యార్థులు 2024లో 3,06,528 మంది ఉత్తీర్ణులైతే, ఈ ఏడాది ఆ సంఖ్య 3,51,521కు పెరిగింది. అంటే గతేడాదితో పోలిస్తే 44,993 మంది అదనంగా ఇంటర్‌ పాస్‌ అయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల తర్వాత ఉత్తీర్ణులు ఇంకా పెరుగుతారు. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే విద్యార్థులు ఇంజనీరింగ్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలిన వారు సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఇదే సమయంలో డిగ్రీలోనూ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సు బీసీఏకు గత కొన్నేళ్లుగా డిమాండ్‌ భారీగా పెరిగింది. రాష్ట్రంలో గతేడాది 1.81 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లకు ఏఐసీటీఈ అనుమతివ్వగా.. వాటిలో 1.2 లక్షల వరకు భర్తీ అవుతున్నాయి. ఇక డిగ్రీ కోర్సుల్లో 4.47 లక్షల సీట్లు ఉంటే లక్షన్నర మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ సీట్లు ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. అయితే ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు సీట్లు మాత్రమే ఎక్కువగా భర్తీ అవుతున్నాయి. మొత్తం సీట్లలో దాదాపు సగం సీఎ్‌సఈ సీట్లే ఉంటున్నాయి.


సీఎ్‌సఈలో అనుబంధ గ్రూపులు పెరిగిపోవడంతో విద్యార్థులు తొలుత వాటినే కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఈసీఈ కోర్సుకు డిమాండ్‌ ఉంది. మిగిలిన ఇంజనీరింగ్‌ కోర్సుల సీట్లు చాలా వరకు మిగిలిపోతున్నాయి. కాలేజీ యాజమాన్యాలు కూడా సీఎ్‌సఈ సీట్లు మాత్రమే పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంజనీరింగ్‌లో సీఎ్‌సఈ సీట్లు రానివారు డిగ్రీలో బీసీఏ కోర్సుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఇంటర్‌లో 45 వేల మంది ఉత్తీర్ణులు పెరగడంతో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో అడ్మిషన్లు పెరగనున్నాయి.

డిగ్రీ కోర్సుల్లో పెరగనున్న అడ్మిషన్లు

మరోవైపు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ భారీగా ఉత్తీర్ణత శాతం పెరగడంతో డిగ్రీలో అడ్మిషన్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులే ఎక్కువగా సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ లాంటి గ్రూపులను ఎంచుకుంటారు. వారంతా డిగ్రీలో చేరే అవకాశం ఉంది. తాజా ఇంటర్‌ ఫలితాల్లో గ్రూపుల వారీగా ఉత్తీర్ణతను పరిశీలిస్తే... సెకండియర్‌లో ఎంపీసీలో 4 శాతం, బైపీసీలో 7 శాతం ఉత్తీర్ణత పెరిగింది. సీఈసీలో 7 శాతం, హెచ్‌ఈసీలో 6 శాతం, ఎంఈసీలో 8 శాతం చొప్పున ఉత్తీర్ణత పెరిగింది. ఇంజనీరింగ్‌ వైపు వెళ్లే విద్యార్థుల్లో కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. అలాగే జాతీయ విద్యా సంస్థల్లోనూ సీట్లు పొందుతుంటారు. కానీ సాధారణ డిగ్రీ చేసే వారు రాష్ట్రంలోని కాలేజీల్లోనే చేరతారు. కాగా, గతేడాది నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ డిగ్రీ కోర్సులు ప్రారంభించడంతో డిగ్రీకి కూడా డిమాండ్‌ పెరుగుతోంది. కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మాత్రం అడ్మిషన్లు పడిపోతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:22 AM