ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భృంగి వాహనంపై శ్రీశైలేశుడు

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:27 PM

శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

భృంగివాహనంపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు

బ్రహ్మోత్సవాల సందడిలో శ్రీగిరి

ఉత్సవం ఎదుట చెంచుల కోలాహలం

శ్రీశైలం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఆదివారం లోకకళ్యాణ ం కోసం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. అనంతరం చండీశ్వర స్వామికి రుద్ర పారాయణాలు, చతుర్వేద పారాయణాలు చేశారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లుకు భృంగివాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చి పురవీధుల్లో గ్రామోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఉత్సవం ఎదుట కళాకారులు, డప్పు వాయిద్యాలు, కళాకారుల శంఖు, ఢమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకున్నాయి.

ఫ నేడు కైలాస వాహన సేవ

సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు కైలాసవాహన సేవ నిర్వహిస్తారు.

Updated Date - Jan 12 , 2025 | 11:27 PM