SPORTSMENS: క్రీడాకారులకు ఉజ్వల భవిత
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:05 AM
SPORTSMENS: :క్రీడా కారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 41వ రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలను శనివారం ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడాకారుడిగా తయారవ్వాలని, జిల్లా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలని ఆకాంక్షించారు. గతంలో క్రీడ లకు ప్రోత్సాహం ఉండేది కాదని... కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తరువాత అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
పలాస, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):క్రీడా కారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 41వ రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలను శనివారం ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడాకారుడిగా తయారవ్వాలని, జిల్లా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాలని ఆకాంక్షించారు. గతంలో క్రీడ లకు ప్రోత్సాహం ఉండేది కాదని... కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తరువాత అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. బాలురతో సమానంగా బాలికలు పాల్గొంటు న్నారని... వారికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. అంతకుముందు ఆమె క్రీడ, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. పి.తవిటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ నాయ కులు పీరుకట్ల విఠల్‌రావు, టంకాల రవిశంకర్ గుప్తా, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, జోగ మల్లి, కొరికాన శంకర్, డాక్టర్ ఎం.మల్లేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మజ్జి పున్నయ్య, పీఈటీలు శేఖర్ బాబు, హరి, పద్మలోచనరావు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 12:05 AM