రెల్లి ఉప కులాలకు తీవ్ర అన్యాయం

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:58 PM

ఎస్సీ వర్గీకరణతో రెల్లి, ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు కె.రవికుమార్‌ అన్నారు.

రెల్లి ఉప కులాలకు తీవ్ర అన్యాయం
హిరమండలంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న రెల్లి కులస్థులు

హిరమండలం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణతో రెల్లి, ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు కె.రవికుమార్‌ అన్నారు. హిరమండలం లో జైభీమ్‌ యువజన సంఘ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయం పోరాటం కోసం అలి కాం-బత్తిలి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడం దారుణమన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్థులకు ఒక శాతం రిజర్వేషన్‌ వర్తించడం అన్యాయ మన్నారు. 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం తీవ్ర తరం చేస్తా మన్నారు. కార్యక్రమంలో బత్తిలి, కొత్తూరు, కొరసవాడ, ఎల్‌.ఎన్‌పేటలకు చెందిన పలు వురు రెల్లి కుల సంఘ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:58 PM