అ‘పూర్వ’ కలయిక
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:41 PM
నందిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1987-92 మధ్య ఆరు నుంచి పదో తరగతి నుంచి వరకు చదువుకున్న విద్యార్థులు 32 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

నందిగాం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): నందిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1987-92 మధ్య ఆరు నుంచి పదో తరగతి నుంచి వరకు చదువుకున్న విద్యార్థులు 32 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఒకచోట కలిసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందం పొందారు. ఒకరికొకరు పరిచయం చేసుకుని ఆట పాటలతో సందడి చేశారు. నాటి ఉపాధ్యాయులు జె.ఆది నారాయణ, ఈశ్వరరావు, ఎస్.వెంక టేశం, పి.రామకృష్ణ, బి.తాతయ్య, సీ హెచ్ సద్గుణమూర్తి, టి.లక్ష్మీనారాయణ, ప్రస్తుత హెచ్‌ఎం వై.హరిబాబును సత్కరించి వారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో నాటి విద్యార్థులు జె. జయరాం, ఆర్.శాంతికుమార్, ఎ.వెంకటరమణ, జి.రవిబాబు, డి.లక్ష్మీనారా యణ, ఎ.దేవరాజు, కె.నీరజ, పి.ఉషారాణి, వనజాక్షి, గణపతి, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఔదార్యం
టెక్కలి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2015లో ఇంటర్ చదువుకున్న విద్యర్థులు సహచర మిత్రుడు బన్నువాడ గ్రామానికి చెందిన కొత్తపల్లి కృష్ణారావు గత ఏడాది నవంబరులో రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ మేరకు ఆదివారం వీరంతా సమావేశమై మిత్రుని ఇద్దరు పిల్లల పేరున రూ.40 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్, నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారికి కృష్ణారావు భార్య కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Feb 09 , 2025 | 11:41 PM